Advertisement
Google Ads BL

బన్నీ సినిమాలో విలన్‌గా విజయ్‌ సేతుపతి!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు హిట్టవ్వగా హ్యాట్రిక్ మూడో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో బన్నీ బెస్ట్ ఫ్రెండ్, బావా అనిపిలుచుకునే చనువుండే నవదీప్.. విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ‘అల వైకుంఠపురంలో..’ తర్వాత బన్నీ సుకుమార్‌తో సినిమా చేస్తారన్న విషయం విదితమే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? విలన్‌గా ఎవర్ని తీసుకోవాలని దర్శకనిర్మాతలు బేరీజు చేసుకుంటున్నారట. ఈ క్రమంలో తమిళనాట హీరోగా.. తెలుగునాట విలన్‌గా ఓ వెలుగుతున్న విజయ్ సేతుపతిని తీసుకోవాలని భావిస్తున్నారట. విజయ్‌తో సుకుమార్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం విజయ్‌ను తీసుకుంటే కలిసొస్తుందని భావిస్తోందట. కాగా ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించిన సేతుపతి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సైరా’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

కాగా.. సంక్రాంతి తర్వాత ఓ పదిహేను రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమా చేయాలని బన్నీ యోచిస్తున్నాడట. అందుకే సుకుమార్ పైవిధంగా ప్లాన్‌లు చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. కథలో మార్పులు చేర్పులు చేయాలని ఇదివరకే సుక్కుకు బన్నీ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.

Vijay Sethupathi As a Villain in Bunny Movie!:

Vijay Sethupathi As a Villain in Bunny Movie!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs