Advertisement
Google Ads BL

సౌత్ ఇండియాలో ‘రాములో రాముల’ రికార్డ్


అల వైకుంఠపురం లోని ‘రాములో... రాముల’ పాట  దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించిన గీతం

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల  అయిన మొదటిపాట ‘సామజవరగమన’ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట రికార్డులను తిరగరాస్తోంది.

ఇక దీపావళి సందర్భంగా విడుదలైన రెండో పాట ‘రాములో... రాముల’ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తొలి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తొలి పాటను మించి రెండో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. ‘సామజవరగమన’ తిరగరాసిన రికార్డులను దాటి ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట దాదాపు 8.3 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. లైక్స్ పరంగా కూడా ఇప్పటికే 340K  లైక్స్ వచ్చాయి. సామజవరగమన పూర్తిగా క్లాస్ సాంగ్ కాగా, రాములో రాముల పార్టీ సాంగ్. మాస్ టచ్ తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు తొలిసారి విన్న దగ్గర నుండే బాగా నచ్చేస్తోంది.  అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్ లు కూడా ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు అసలైన ఆకర్షణగా మారాయి.

అల వైకుంఠపురములోని తారలు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,

ఫైట్స్: రామ్ – లక్ష్మణ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ramuloo Ramulaa, The Most Viewed South Indian Song in 24 hours:

Ramuloo Ramulaa Creates South India Record
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs