సంక్రాంతి కి వస్తున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు పై రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్నారు అనిల్ రావిపూడి. దీపావళి కానుకగా విజయశాంతి పోస్టర్, రష్మిక ఫోటో, మహేష్ బాబు పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. ఇవి చాలదు అన్నట్టు నిన్న ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసారు అనిల్ రావిపూడి.
ఈ వీడియోలో నటుడు సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఉంటారు. ఇందులో క్రైమ్ బ్రాంచ్ కోటిగా సుబ్బరాజు, అతని అసిస్టెంట్ గా వెన్నల కిషోర్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ట్రైన్ ఎపిసోడ్, తరువాత కర్నూల్ ఎపిసోడ్, ఆ తరువాత ప్రకాష్ రాజ్, రష్మిక, హీరో వస్తారు అని ముచ్చటించుకుంటున్నప్పుడు... ఏం జరుగుతుంది అని అనిల్ అడగగా... ఏం లేదు కాస్త స్క్రీన్ ప్లే అడుగుతుంటే చెపుతున్నాం అని సుబ్బరాజు చెపుతారు. దాంతో అనిల్ కొంచెం కంగారు పడి స్క్రీన్ ప్లే చెబుతున్నారా... ప్రీ క్లైమాక్స్ దాకా వెళ్లారు తెలుసా..! ఇది దీపావళి అన్న.. మనది సంక్రాంతికి. ఇప్పటికే లీకెడ్ ఫొటోస్ తో వీడియోస్ తో చస్తున్నాం. ఇంకా స్టోరీ లీక్ కూడానా.. కొంచెం సంక్రాంతి వరకు ఓపికగా వెయిట్ చేయండి అని సరదాగా చెప్పారు. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ కాలేదు.