Advertisement
Google Ads BL

‘మీకు మాత్రమే చెప్తా’లో అవన్నీ ఉన్నాయట!


ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు మీకు మాత్రమే చెప్తా చిత్రంలో చాలా ఉన్నాయి - ఆర్టిస్ట్ అభినవ్ గోమటం

Advertisement
CJ Advs

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రంలో నటించిన అభినవ్ గోమటంతో ఇంటర్వ్యూ...

నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, సినిమాలంటే ఆసక్తితో మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాను తరువాత సినిమాల్లోకి వచ్చాను. నేను నటించిన ఈ నగరానికి ఏమైంది బాగా సక్సెస్ కావడమే కాకుండా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. యస్ సినిమా తరువాత కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా సినిమాలో చెయ్యమని ఆడినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. తరుణ్ తో నా జర్నీ అలాంటిది.

మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్ కు చెప్పాడు, అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్  ఇది, కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది కావున విజయ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు, తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో నటించాడు. షూటింగ్ టైమ్ లో తరుణ్ లోని ఇంకో స్కిల్ బయటపడింది, అతనికి డైరెక్షన్ స్కిల్స్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో ఆయనే ఈ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ చిత్రానికి మొదట ఎవరికి చెప్పొద్దు అనే టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ తో మరో సినిమా విడుదలకు సిద్దంగా ఉండడంతో మేము మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ఖరారు చేశాం. టైటిల్ కు అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. సినిమా 2 గంటల 4 నిమిషాలు ఉంటుంది, ఎక్కడా బోర్ లేకుండా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకెక్కించడం జరిగింది.

మొబైల్ వాడకం ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరూ చేస్తున్న పని. ఆ మొబైల్ వాడకం వల్ల మా సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని ఎంటర్టైన్ పద్దతిలో చెప్పడం జరుగింది. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ట్రైలర్ లో మేము కొంతే చూపించాము. సినిమాలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఉంటాయి.

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నేను నటించడం లక్కీగా భావిస్తున్నాను. నా రోల్ ఎంటర్టైన్ గా ఉంటుంది. మీకు మాత్రమే చెప్తా అనే డైలాగ్ సినిమాలో నేనే చెబుతాను. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఈ మూవీలోనే అంత హిలేరియర్ రోల్ చేశాను. సినిమా చూశాక ఆడియన్స్ తప్పకుండా ఆలోచిస్తారు, సినిమాకు కనెక్ట్ అవుతారు.

నితిన్ రంగ్ దే, జయంత్ సి పరాంజీ గారి సినిమాతో పాటు హీరో సుశాంత్ సినిమాలో నటిస్తున్నాను. నాకు, ఒకే తరహా పాత్రలు చెయ్యడం ఇష్టం ఉండదు, అన్నీ రకాల పాత్రలు చెయ్యాలని ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలనేదే నా కోరికని ఇంటర్వ్యూ ముగించారు.

Meeku Maathrame Cheptha Actor ABHINAV GOMATAM Interview:

ABHINAV GOMATAM talks about Meeku Maathrame Cheptha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs