Advertisement
Google Ads BL

శ్రీముఖినే అందరూ టార్గెట్ చేస్తున్నారు!


బిగ్ బాస్ 3 ఫైనల్ లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రేజాలు ఉన్నారు. అయితే టైటిల్ ఫెవరెట్ గా శ్రీముఖి, బాబా, రాహుల్ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి ఫ్యాన్స్, ఆమెని సపోర్ట్ చేసే తోటి యాంకర్స్ శ్రీముఖిని ఫైనల్ విన్నర్ ని చెయ్యాలంటూ హంగామా చేస్తున్నారు. మొదటి నుండి శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అందరికి పోటీ ఇవ్వడమే కాదు... బయట కూడా ఆమెకి సపోర్టర్స్ బాగా ఉన్నారు. ఇక బయట రాహుల్ సిప్లిగంజ్ ని సపోర్ట్ చేసే తోటి సింగర్స్ కూడా రాహుల్ ని ఫైనల్ విన్నర్ కావాలంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ వారం హౌస్ నుండి ముందు నుండి అనుకున్నట్లుగా శివ జ్యోతి ఎలిమినేట్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఫైనల్ కంటెస్టెంట్ శ్రీముఖి‌కి తన సన్నిహితుల సపోర్ట్ ఎంత వుందో.. హౌస్ నుండి బయటికొచ్చిన వారి నుండి అంతే వ్యతిరేఖత ఉంది. ప్రతి వారం షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్ట్ట్స్ ఎవరో ఒకరు శ్రీముఖి బిగ్ బాస్ ఆటపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పక్కాగా బిగ్ బాస్ గేమ్ ఆడుతుందని, ఆమె వలన చాలామంది బలవుతున్నారని హిమజ, అషు రెడ్డి, మహేష్ తాజాగా ఆ లిస్ట్ లోకి మొదటి వారమే బయటికొచ్చిన హేమ కూడా చేరింది.

శ్రీముఖి చాలా ప్లాన్ తో గేమ్ ఆడుతుందని... బిగ్ బాస్ ఎడిటర్స్ బిగ్ బాస్ అని వారు హౌస్ లో జరిగే చెడునే చూపిస్తున్నారు కానీ, మంచి చూపడం లేదని, ఫైనల్ విన్నర్ గా నిలిచేందుకు శ్రీముఖి అందరిని గ్రిప్ లో పెట్టుకుంది అంటూ హేమ చేసిన వ్యాఖ్యలు శ్రీముఖి ఓట్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి తనని రమ్మని ఇన్వైట్ చేసారని కానీ తాను బిగ్ బాస్ లో జరిగే ఆటను వ్యతిరేకించడం వలన తాను ఫైనల్ ఎపిసోడ్ కి హాజరవనని తెగేసి చెప్పింది హేమ.

Hema Sensational Comments on Sree Mukhi:

Bigg Boss3: All Contestants Targets Sree Mukhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs