Advertisement
Google Ads BL

శివ సాంగ్‌తో ఎంట్రీ.. శివజ్యోతి ఔట్!


తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌లో 14వ వారాలు పూర్తి చేసుకుంది. నిన్న ఆదివారం కావడంతో ఒకర్ని బిగ్‌బాస్ ఎలిమినేట్ చేశాడు. అయితే ముందుగా అందరూ ఊహించినట్లుగానే హౌస్ నుంచి శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఔటయ్యింది. కాగా.. బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి నామినేట్ అయిన విషయం విదితమే. శనివారం నాటి 98వ ఎపిసోడ్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి సేఫ్ అయ్యి ఫైనల్‌కు చేరగా.. శివజ్యోతి, వరుణ్, అలీ నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీళ్లలో శివజ్యోతి ఆదివారం నాడు హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. దీంతో వరుణ్, అలీ కూడా ఫైనల్‌కు వెళ్లిపోయారు. అంటే ఇక మిగిలింది రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖినే.. వీరంతా తుదిపోరులో పోటీపడనున్నారు.

Advertisement
CJ Advs

పూర్తి వివరాల్లోకెళితే ఆదివారం ఎపిసోడ్‌లో ‘శివ’ సినిమాలోని ఆనందో బ్రహ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎలిమినేషన్ ప్రాసెస్‌ను చూసిన నాగ్..  ఒక బోర్డు బిగ్‌బాస్ అని ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్స్‌ను పేర్చారు. ఆ కార్డ్‌ను తిప్పితే వెనక ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ బొమ్మ ఉంటుందని చెప్పిన ఆయన.. ఒక్కొక్క కార్డు తీయగా ఆకరి నుంచి రెండో ‘S‌’ ను తిప్పితే శివజ్యోతి ఫొటో వచ్చింది. దీంతో శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున స్పష్టం చేశాడు. శివ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. శివజ్యోతిని ఔట్ చేశాడన్న మాట.!

శివజ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్‌లో అందరూ ఎమోషనల్ అయ్యారు. యాంకర్ శ్రీముఖి మరింత ఎమోషన్ అయ్యి శివజ్యోతిని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. మరోవైపు వాళ్లను చూసి అలీ కూడా ఎమోషన్ అయ్యాడు. చివరిగా హౌస్ నుంచి బయటికెళ్తూ బాబా భాస్కర్ కాళ్లకు మొక్కి శివజ్యోతి బయటికొచ్చేసింది. ఈ సందర్భంగా శివజ్యోతి బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినప్పుడు తెచ్చుకున్న ట్రంకు పెట్టెను నాగ్ మళ్లీ ఆమె ముందు పెట్టి బయటికి పంపించేశాడు.

Shiva jyothi eliminated From Biggboss:

Shiva jyothi eliminated From Biggboss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs