Advertisement
Google Ads BL

నయన్‌ అందం ‘డబుల్’ కావడానికి కారణమిదేనట!


నయనతార.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. నటన పరంగా ఈమె తర్వాతే మరెవరైనా అన్నంతగా ఇప్పుడు రెండు ఇండస్ట్రీలనూ ఏలుతోంది. మూవీ ప్రమోషన్స్‌కు రాదన్న ఒకే ఒక్క అపవాదు తప్ప ఈ బ్యూటీ విషయంలో మిగతావన్నీ డబుల్ ఓకే. 34 ఏళ్ల వయసులోనూ తన అందచెందాలతో అభిమానులు, సినీప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా.. స్టార్ హీరోల సరసన కూడా ఈ బ్యూటీ నటించేసింది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఓ గుర్తింపు, ఇండస్ట్రీలో ఓ స్థానాన్ని దక్కించుకుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ మధ్య నయన్‌ను ఓ భయం, కొన్ని ఆరోపణలు వెంటాడుతున్నాయట. అవేమిటంటే.. ఆమె చర్మం ముడతలు పడినట్లు అనిపించడం, పలువురు నెటిజన్లు ఆమెను వయసు అయిపోయిందని విమర్శించడంతో ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని మరింత పెంచుకోవాలని భావించిందట. ఇందులో భాగంగా బాడీ ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌ల బాట పట్టినా.. మరోవైపు అందం కోసం బ్యూటీ పార్లర్ల బాటపట్టినా ఎలాంటి ప్రయోజనం లేదట. అందుకే ఇక తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లి సహజ పద్ధతుల ద్వారా తన అందానికి మెరుగులు దిద్దిందట.

నయనతార అందాన్ని కాస్త నిశితంగా గమనిస్తే ‘సైరా’ సినిమా కంటే ముందు.. ఇప్పుడు ముఖంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 34 ఏళ్ల నయన్ ఇప్పుడు 24 ఏళ్ల బ్యూటీగా కనిపించడానికి గట్టిగానే కష్టపడిందన్న మాట. కాగా.. ఇటీవల రిలీజ్ అయిన తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ నటించిన ‘విజిల్’లో నయన్ నటించిన విషయం విదితమే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే తమిళచిత్రంలో నటిస్తోంది.

News About Lady Superstar Nayanatara:

News About Lady Superstar Nayanatara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs