Advertisement
Google Ads BL

శ్రీముఖి బ్రేకప్ ఈ టాప్ యాంకర్‌తోనేనా!?


సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సెన్సేషనలే అన్న విషయం తెలిసిందే. పళ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నట్లుగా.. కాస్త ఫేమ్ ఉన్న సెలబ్రిటీలపై వార్తలు కోకొల్లలుగా వస్తుంటాయ్. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల బిగ్‌బాస్ షోలో భాగంగా తన జీవితంలో జరిగిన చీకటి కోణాలు, రహస్యాలను యాంకర్ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ‘అందరిలాగానే నేను కూడా కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. అంతా సెట్ అయ్యింది.. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కథ మొత్తం మారిపోయింది. అప్పటివరకూ లేని మనస్పర్థలన్నీ అప్పుడే పుట్టుకొచ్చాయ్.. దీంతో జీవితం మొత్తం ఒక్కసారిగా తలక్రిందులైనట్లు అయిపోయింది. ఎవరి జీవితంలోనైనా బ్రేకప్ అనేది వరస్ట్ ఫేజ్’ అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

ఇలా అందమైన రిలేషన్‌లో వచ్చిన అనుకోని ఇబ్బందుల వల్ల చాలా సఫర్ అయ్యానని చెప్పింది. అంతేకాదు ఒకానొక సందర్భంలో చనిపోదామని కూడా అనుకున్నట్లు ఈ షో ముఖంగా చెప్పి తన అభిమానులు, బిగ్‌బాస్ ప్రియులకు శ్రీముఖి షాకిచ్చింది. ఇంతవరకూ అంతా ఓకే.. ఆ తర్వాత తాను కోలుకొని యథావిథిగా తన యాంకరింగ్‌తో బిజీ అవ్వడంతో ఆ జ్ఞాపకాలన్ని మరిచిపోయానని చెప్పి వెక్కివెక్కి ఏడ్చేసింది.

శ్రీముఖి తన బ్రేకప్ గురించి ఇలా చెప్పడంతో ఇంతకీ ఆమె జీవితంలో విలన్ ఎవరు..? ఈ యాంకర్‌ను ఇబ్బంది పెట్టిన ఆ యాంకర్ ఎవరు..? అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో కొందరు ఫలానా యాంకర్ కాసింత హింట్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం బుల్లితెరపై ఎందురు మేల్ యాంకర్స్ టాప్‌లో ఉన్నారో అందరికీ తెలిసిందే. వారిలో ఒకరు శ్రీముఖి బ్రేకప్‌కు కారణమట. కొందరు శ్రీముఖి జీవితంలో విలన్ యాంకర్ రవి అని.. మరికొందరేమో ప్రదీప్ అని.. ఇంకొందరేమో వీరిద్దరూ కాదని చెబుతున్నారు. పైన చెప్పిన పేర్లు.. విషయాలన్నీ నెట్టింట్లో వస్తున్న పుకార్లే. అయితే ఎవరేమనుకున్నా.. ఏవేవో ఊహించుకున్నా ఆ టాప్ యాంకర్ ఎవరెవరో ప్రస్తుతం శ్రీముఖికి మాత్రమే తెలుసు. ఇప్పుడు లైఫ్ సాఫీగానే సాగుతోంది గనుక పేరు చెప్పడానికి ఈ హాట్ యాంకర్ ఇష్టపడరేమో మరి.

Srimukhi Reveals Her Love Story With Top Anchor :

<h1 class="title style-scope ytd-video-primary-info-renderer">Srimukhi Reveals Her Love Story With Top Anchor&nbsp;</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs