Advertisement
Google Ads BL

యాంకర్ ప్రదీప్‌కు అసలేమైంది?


బుల్లితెర మీద లేడి యాంకర్స్‌కి సమానమైన క్రేజ్ ఉన్న మేల్ యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రదీప్. యాంకర్ రవి కూడా ప్రదీప్‌కి తీసుపోడు కానీ.. ప్రదీప్ చేసే చిలిపి అల్లరి ముందు రవి కూడా దిగదుడుపే. అంతలా తన కామెడీతో ప్రదీప్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా, ఢీ జోడి లో ప్రదీప్ యాంకరింగ్‌ని ఇష్టపడని వారుండరు. అయితే క్రేజ్ కి క్రేజ్, డిమాండ్ కి డిమాండ్ ఉన్న ప్రదీప్ ఈమధ్య రెమ్యునరేషన్ భారీగా పెంచేయడంతో..  ఈ టీవీ ఢీ జోడి నుండి యాంకర్ గా ప్రదీప్ ని తీసేశారని ప్రచారం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో జరిగింది.

Advertisement
CJ Advs

ఇక ప్రదీప్ మిగతా షోస్ లోను ఈమధ్యన పెద్దగా కనిపించడం లేదు. అయితే ప్రదీప్ రెమ్యునరేషన్ పెంచిన కారణంగా అతనికి అవకాశాలు పోవడం లేదని, ప్రదీప్‌కి కాస్త అనారోగ్యంగా ఉండడం వలనే అతను బయటికి రావడం లేదని.. తోటి యాంకర్ రవి చెప్పడం చూస్తుంటే.. ప్రదీప్ కి వచ్చిన అనారోగ్యం ఏమిటో అంటూ బుల్లితెర ప్రేక్షకులు తెగ ఇదై పోతున్నారు. 

గత కొద్దిరోజులుగా ఆరోగ్యం సహకరించని ప్రదీప్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడిందని... ఈమధ్యనే ప్రదీప్ బర్త్ డే వేడుకల్లో యాంకర్స్ అంతా పాల్గొన్నామని, త్వరలోనే మళ్ళి ప్రదీప్ యాక్టివ్ గా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అవుతాడని యాంకర్ రవి చెప్పడం చూస్తుంటే.. నిజంగానే ప్రదీప్ కి ఏదో అయ్యింది అంటూ అయన అభిమానులు కంగారు పడుతున్నారు. 

Anchor Ravi Gives Clarity On Anchor Pradeep Health:

Anchor Pradeep faces Health Issues
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs