Advertisement
Google Ads BL

బాలయ్య ‘రూలర్’ లుక్‌పై సెటైర్లే సెటైర్లు..!


న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రానికి సంబంధించి దీపావళి సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్, మూవీ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రూల‌ర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాదు ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు దీన్ని బట్టి క్లారిటీగా అర్థమైపోయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ ఈ లుక్‌ను కాస్త నిశితంగా గమనిస్తే ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపిస్తోంది.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. బాలయ్య ‘రూలర్’ లుక్.. ఒకట్రెండు తేడాలు మినహా సేమ్ టూ సేమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ లుక్‌ను పోలివుండటం గమనార్హం. అంతేకాదండోయ్.. హెయిర్ స్టెయిల్ మొదలుకుని టాప్ టూ బాటమ్ యాజ్ ఇటీజ్ దింపేసినట్లుగా ఉంది. ‘దర్బార్’ చేతిలో లాఠీ, ఖాకీ చొక్కాపై కోటు.. ‘రూలర్’ చేతిలో సుత్తి, చొక్కాపై కోటు లేదంతే మిగితాదంతా అచ్చుగుద్దినట్లుగా దింపేశారు. కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘దర్బార్’ను సంక్రాంతి పండుగ బరిలో దింపేందుకు ముస్తాబు చేస్తోంది చిత్రబృందం.

ఈ విషయాన్ని పసిగట్టిన నాన్ బాలయ్య ఫ్యాన్స్, నెటిజన్లు, క్రిటిక్స్ ఈ రెండు పిక్‌లు ఒకదానికొకటి జతచేసి సెటైర్ల మీద సెటైర్లేస్తున్నారు. అబ్బా మన తెలుగోళ్లకు బుర్రలేదా ఏంటి..? మరీ ఇలా అచ్చుగుద్దినట్లుగా దింపేసి ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు మరికొందరు వారెవ్వా ఏదో ఒక లుక్ రిలీజ్ చేయాలని అని చెప్పి ఇలా కాపీ పేస్ట్‌లు చేస్తే.. దీంతో సినిమా ఏ రేంజ్‌లో కళ్లకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్ సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో..!

Balayya Ruler Movie Look.. Satires!:

Balayya Ruler Movie Look.. Satires!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs