Advertisement
Google Ads BL

‘సరిలేరు నీకెవ్వరు’ దీపావళి డబుల్ ధమాకా!


సూపర్ స్టార్ మహేష్  ‘సరిలేరు నీకెవ్వరు’ దీపావళి డబుల్ ధమాకా

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌ అప్ కమింగ్ సెన్సేషన్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్స్ ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 13 సంవత్సరాల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. విజయశాంతి సరిలేరు నీకెవ్వరులో భారతి అనే కీలక పాత్రలో నటిస్తుండగా శనివారం దీపావళి శుభాకాంక్షలతో ఆమె పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేశారు. సూపర్ స్టార్ అభిమానులకి దీపావళి డబుల్ ధమాకా లాగా శనివారం సాయంత్రం 5:04 కి సూపర్ స్టార్ మహేష్ బుల్లెట్ మీద వస్తున్న డాషింగ్ పోస్టర్ ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 4 నుండి నెలాఖరు వరకు తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో  ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Deepaavali Double Dhamaka From Sarileru Neekevvaru:

Vijayashanthi and Mahesh Babu Posters Released from Sarileru Neekevvaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs