రామ్ చరణ్ ఈ ఏడాది వినయ విధేయరామతో ఊర మాస్ సినిమా డిజాస్టర్ అందుకున్నాడు. బోయపాటి రామ్ చరణ్ ని ఊర మాస్ గా చూపించి హిట్ కొడదామనుకుంటే.. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా మాకొద్దు బాబోయ్ అంటూ తిప్పికొట్టారు. కథ, కథనం లేక రామ్ చరణ్ యాక్షన్ ని చూడలేక వినయ విధేయరామ ప్లాప్ కాదు డిజాస్టర్ అయ్యింది. ఇక రామ్ చరణ్ కనీసం ఆ సినిమా ప్లాప్ పై మట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. బోయపాటి శ్రీను అయితే చాలా రోజులు అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొన్న మా టివి వారు ఈ సినిమాని తమ ఛానల్ లో ఈ నెల 13 న ప్రసారం చేసింది. అయితే రామ్ చరణ్ వినయ విధేయరామ థియేటర్స్ లోనే కాదు బుల్లితెర మీద డిజాస్టర్ టీఆర్పీ రేటింగ్ ని మూటగట్టుకుంది.
అయితే ఇదే సమయంలో ఈ ఏడాది తక్కువ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయినట్లుగా బుల్లితెర మీద కూడా టాప్ లేపింది. రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ థియేటర్స్ లో దుమ్ము దులిపినట్టుగా... బుల్లితెర మీద కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. అయితే రామ్ చరణ్ వినయ విధేయరామ స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన టైం లోనే జీ ఛానల్ లో రామ్ ఇస్మార్ట్ శంకర్ ప్రసారం అయ్యింది. రామ్ ఇస్మార్ట్ కి 14.44 టీఆర్పీ రేటింగ్ రాగా... చెర్రీ వినయ విధేయరామకి 7.85 రేటింగ్ రావడంతో... చెర్రీ పై రామ్ ఇలా పై చెయ్యి సాధించాడు.