Advertisement
Google Ads BL

సంక్రాంతికి త‌గ్గట్టుగా ‘ఎంత మంచివాడవురా’!


నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని , తెలుగు కుటుంబ ప్రేక్షకుల హృదయాల్నీ గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శరవేగంతో ఈ సినిమా రూపొందుతోంది. మూడు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోన్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి రేసుకు సిద్ధమవుతోంది. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సుమారు 40 మంది వరకు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఇటీవలే మూడో షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసుకుని, ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ‘ఆదిత్యా’ ఉమేష్‌ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘కల్యాణ్‌రామ్‌ - స‌తీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో మంచి వేల్యూబుల్ సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని  వర్గాల ప్రేక్షకులకూ నచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. అక్టోబర్‌ 9 నుంచి 22 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, హైదరాబాద్‌ పరిసరాల్లోనూ మూడో షెడ్యూల్‌ చేశాం. ప్రధాన  తారాగణం పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాం. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర  సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నాం. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌పై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఒక పాటను, కల్యాణ్‌రామ్‌, మెహరీస్‌, సుహాసిని, శరత్‌బాబు, వెన్నెల కిశోర్‌ తదితరులపై రఘు మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో మరో పాటను షూట్‌ చేస్తాం. ఈ నెలాఖరు నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెడతాం. జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని తెలిపారు.

ద‌ర్శకుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ... ‘ఇప్పటికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. క‌ల్యాణ్ రామ్‌గారిని స‌రికొత్త డైమ‌న్షన్‌లో చూపించే చిత్రమిది. వ‌చ్చే సంక్రాంతికి త‌గ్గట్లు ఉండే చిత్రం ఇది’ అన్నారు.

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

News About Entha Manchivadavura:

News About Entha Manchivadavura
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs