Advertisement
Google Ads BL

‘సరిలేరు..’ తర్వాత మహేష్ సినిమా ఏంటి?


భరత్ అనే నేను తర్వాత రెండు నెలల గ్యాప్ తో మహర్షి సినిమాని మొదలెట్టిన మహేష్ బాబు.. మహర్షి తర్వాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాని పట్టాలెక్కించాడు. ఎప్పుడూ నెలలు నెలలు గ్యాప్ తీసుకునే మహేష్ బాబు... ఇప్పుడు అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి తర్వాత మహేష్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొనింది. అయితే మహేష్ ఎవరితో తన తదుపరి చిత్రాన్ని చేస్తాడో అంటూ మీడియాలో రోజుకో న్యూస్ అయితే ప్రచారంలోకి వస్తుంది. మహేష్ అసలైతే సుకుమార్ తో చెయ్యాల్సింది. కానీ సుకుమార్ - మహేష్ సినిమా ఆగిపోవడమే కాదు. మళ్ళీ వారి కాంబోలో మరో మూవీ వచ్చే ఛాన్స్ లేదు. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ చెప్పిన కథలో మార్పులు కోరిన మహేష్ కి సందీప్ వంగ కథలో మార్పులు చేర్పులు లేవంటూ బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసాడు.

Advertisement
CJ Advs

ఇక పరశురామ్ తో మహేష్ సినిమా ఆన్నారు. కానీ పరశురామ్ చెప్పిన కథ కూడా మహేష్ ని మెప్పించలేకపోయింది. ఇక తాజాగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మహేష్ కథ చర్చలు జరిపాడని అంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ని కంప్లీట్ చెయ్యడానికి ఇంకా టైం పడుతుంది. ఇక మహర్షి తర్వాత వంశీ పైడిపల్లితో మళ్ళీ మహేష్ సినిమా చేస్తా అన్నాడు. ఇక వంశీ కూడా మహేష్ ని వదలకుండా తిరుగుతున్నాడు. కానీ వంశీ పూర్తి కథ, స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు. మరి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెంటనే మరో సినిమాతో సెట్స్ మీదకెళ్ళలేడు. సంక్రాంతికి సరిలేరు విడుదలైతే.. తన తదుపరి చిత్రం కోసం మహేష్ ఎన్ని నెలలు వెయిట్ చెయ్యాలో అనేది డిసైడ్ అవుతుంది. 

Confusion on Mahesh Babu next Project:

Mahesh Babu Next Film Not Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs