Advertisement
Google Ads BL

ఎమ్మెల్యేగా పోటీకి గట్టిగానే వెనకేస్తున్న నిర్మాత!


సినీ ఇండస్ట్రీ నాలుగు రాళ్లు సంపాదించుకున్నాక ఆ తర్వాత టక్కున వచ్చే ఆలోచన రాజకీయాల్లో రాణించాలనే.! అయితే ప్రజాసేవ కోసం పొలిటీషియన్‌గా మారుతారా..? లేకుంటే ఉన్న కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి నేతలుగా మారుతారా..? అనేది ఇక్కడ అప్రస్తుతం. అయితే ఇలా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఊహించని రేంజ్‌కు వెళ్లారు.. మరికొందరూ ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అయ్యారు కూడా. మరీ ముఖ్యంగా కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఎక్కువగా నటీనటులు, దర్శకనిర్మాతలు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్‌లో ఓ పేరుగాంచిన అటు బడా.. ఇటు చోటా కాని ఓ నిర్మాత ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని.. రాజకీయాల్లో రాణించాలని బాగా తహతహలాడుతున్నాడట. అందుకే గట్టిగానే వెనకేసుకుంటున్నాడట. అవసరానికి మించి.. ఖర్చుపెట్టకుండా రూపాయి.. రూపాయి కూడబెడుతున్నాడట. వాస్తవానికి రాజకీయాలంటే ఈయనకు మక్కువ. అందుకే మొదట సినీ రంగంలోకి వచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట. 

ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి రావాలని కానీ.. తాను పోటీ చేస్తానని పార్టీల అధినేతను టికెట్‌ అడగటం కానీ చేయలేదు. రానున్న రోజుల్లో అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2024లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆ నిర్మాత తన అత్యంత సన్నిహితుల చెవిన వేయగా.. ఈ విషయం వెలుగుచూసింది. మరి ఈ నిర్మాత ప్రయత్నాలు ఏ మాత్రం ఫలిస్తాయో..? నిర్మాతగా పాసైన ఈయన రాజకీయాల్లో ఏ మేరకు పాస్ అవుతారో..? అనేది తెలియాలంటే 2024 వరకు వేచి చూడాల్సిందే మరి.

News About Tollywood Producer:

News About Tollywood Producer  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs