Advertisement
Google Ads BL

RRR తర్వాత కుర్ర దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ!


ఓటమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టా్త్మక, భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ సినిమాలో స్టారో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించేశారు కూడా. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఏం చేయబోతున్నారు..? ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు..? అనేదానిపై నందమూరి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఓ కుర్ర దర్శకుడి సినిమాలో నటిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

సింగిల్ సినిమా.. ‘రాజా రాణి’తో దర్శకుడిగా మారిన కుర్ర దర్శకుడు అట్లీ కుమార్.. ఇప్పుడు వరస విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అలా కోలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఎప్పట్నుంచో  తెలుగు ఇండస్ట్రీకి రావాలని.. అది కూడా జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాతోనే అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. ఇందుకు కారణం జూనియర్ అంటే అట్లీకి అమితమైన ఇష్టం గనుక. ఇప్పటికే పలుమార్లు ఎన్టీఆర్ గురించి అట్లీ ఇంటర్వ్యూలు, హైదరాబాద్‌లో జరిగే ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు.

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, అట్లీ తెరకెక్కించిన ‘విజిల్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ కుర్ర దర్శకుడు మాట్లాడుతూ.. జూనియర్‌ను ఆకాశానికెత్తేశాడు. ‘తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నా ప్రతీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్.. ఫోన్ చేసి మరీ అభినందిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఆయన.. తెలుగులో త్వరలోనే తాను ఇష్టపడే స్టార్ హీరోతోనే పెద్ద సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంటే ఆ స్టారో హీరో ఎవరో కాదు.. ఎన్టీఆర్ అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్న మాట. మొత్తానికి చూస్తే.. కోలీవుడ్‌లో వరుస విజయాలతో షేక్ చేసిన కుర్రాడు.. టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆదరాభిమానులు సంపాదించుకుంటాడో..? మొదటి సినిమా ఎలా ఉండబోతోందో..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Jr Ntr Next Movie With Young Director.. !:

Jr Ntr Next Movie With Young Director.. !  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs