Advertisement
Google Ads BL

రమ్మీ అడతా.. కాజల్ ఓపెనైపోయింది!


ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఆన్ లైన్ కార్డ్స్ గేమ్స్ నిషేధించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆన్‌లైన్‌ రమ్మీ, కార్డ్‌ గేమ్స్‌ని ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. తెలంగాణలో కాకుండా ఇండియా మొత్తంలో ఆన్‌లైన్‌ రమ్మీ రెవెన్యూ పన్నెండు వేల కోట్ల రూపాయలు వుంటుందని అంచనా వేశారు. ఈ గేమ్స్ వల్ల చాలామంది ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. ఇటువంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంకరేజ్ చేయడంలేదు.

Advertisement
CJ Advs

అయితే ప్రజల్ని ఆన్ లైన్ పేకాట ఆడించేందుకు చాలా వెబ్ సైట్స్ చాలా ట్రై చేస్తున్నారు. మరింత మందిని ఇటువైపు ఆకర్షించడానికి వివిధ వెబ్‌సైట్లు ప్రముఖ హీరోయిన్లని బ్రాండ్‌ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నాయి. ఎప్పటినుండో హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఒక కార్డ్‌ గేమ్స్‌ వెబ్‌సైట్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ చందమామ కాజల్‌ కూడా ఓ పేకాట సైట్‌కి ప్రచారం చేసే బాధ్యతలు తీసుకుంది.

ఈమె ఆ ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్ ని ప్రమోట్ చేయడమే కాదు తాను రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడతానని చెబుతోంది. మన సినిమా వాళ్లు నిజంగానే కార్డ్‌ గేమ్స్‌ భేషుగ్గా ఆడతార్లెండి. కాజల్ లా బయటకు చెప్పుకోకపోయిన చాలామంది ఇందులో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కాజల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరు ఆడతారో.

Kajal Agarwal Revealed top secret:

Kajal Agarwal Brand Ambassador for Rummy game
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs