Advertisement
Google Ads BL

‘ఒరేయ్‌ బుజ్జిగా’ సెట్‌లో సందడే సందడి


‘ఒరేయ్‌ బుజ్జిగా’ సెట్‌లో సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Advertisement
CJ Advs

‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు తాజాగా యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఐ.ఆండ్రూ పుట్టినరోజు అక్టోబర్‌ 24. ‘ఒరేయ్‌ బుజ్జిగా’ షూటింగ్‌ పటాన్‌చెరులో జరుగుతోంది. సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ తన పుట్టినరోజును సెట్‌లో యూనిట్‌ సభ్యుల నడుమ కేక్‌ కట్‌ చేసి జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెట్‌లో యూనిట్‌ సభ్యులందరి నడుమ ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరగడం చాలా హ్యాపీగా ఉంది. మా ‘ఒరేయ్‌ బుజ్జిగా’ షూటింగ్‌ ప్రస్తుతం పటాన్‌చెరులో జరుగుతోంది. సినిమా చాలా బాగా వస్తోంది. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని క ష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Cameraman Andrew Birthday Celebrations at Orey Bujjigaa Sets:

Orey Bujjigaa Team Celebrates Andrew Birthday at Sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs