Advertisement
Google Ads BL

కార్తి కెరీర్‌లో ‘ఖైదీ’ బెంచ్ మార్క్ మూవీ అంట!


డిఫ‌రెంట్ యాక్ష‌న్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ‘ఖైదీ’ కార్తి కెరీర్‌లో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది - డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేత, నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు

Advertisement
CJ Advs

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేత, నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు ఇంటర్వ్యూ...

‘ఖైదీ’ మొత్తం సినిమా ఒక రాత్రిలో ఉంటుంది కదా? చిత్రీకరణ సమయంలో ఎలాంటి సవాళ్లు ఫేస్‌ చేశారు?

- అవును. దర్శకుడు లోకేష్‌ రాసిన ‘ఖైదీ’ సినిమా మొత్తం కథ కేవలం ఒక రాత్రి నాలుగు గంటల్లోనే జరుగుతుంది. జీవిత ఖైదు చేయబడిన ఒక ‘ఖైదీ’ జైలు నుండి బయటకు వచ్చి బయటి ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తే.. అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు? అనేది ‘ఖైదీ’ స్టోరీ లైన్‌. మొత్తం షూటింగ్‌ రాత్రులు కావడం, అది కూడా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికి మేము చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. తీవ్రమైన చలిలో, సహజంగా కనిపించేలా లైటింగ్‌ను అమర్చడం మాకున్న అతి పెద్ద సవాలు. కానీ, మా టీమ్‌ మరియు హీరో కార్తి డెడికేషన్‌తో షూటింగ్‌ సజావుగానే సాగింది.

హీరోయిన్‌, పాటలు లేకుండా చేసిన ఇదొక అరుదైన ప్రయత్నం అనుకోవచ్చా?

- ఇది ఒక రేర్‌ అటెంప్ట్‌ అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. సాధారణంగా కమర్షియల్‌ సినిమాలు అయినా సరే కథ డిమాండ్‌ మేర సన్నివేశాలు ఉంటేనే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేయడం జరుగుతుంది. ‘ఖైదీ’ కమర్షియల్‌ మూవీ అయినప్పటికీ కథ ప్రకారంగానే వెళ్ళాం తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా ఈ కథ వన్‌ నైట్‌ థ్రిల్లర్‌ కాబట్టి హీరోయిన్‌ అవసరం రాలేదు. అలాగే ఇంట్రడక్షన్‌ సాంగ్‌ అవసరం కూడా ఈ సినిమాలో లేదు. కథ డిమాండ్‌ మేరకు హీరోయిన్‌, పాటలు లేకుండా వెళ్ళామే తప్ప వేరే ఉద్దేశ్యం మాకు లేదు.

కార్తిని ‘ఖాకి’ లాంటి యాక్షన్‌ సినిమాల్లో చాలాసార్లు చూశాం కదా! ఈ కథలో కొత్తదనం ఏంటి?

- ‘ఖాకి’ సినిమా యదార్ధఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక కాప్‌ థ్రిల్లర్‌. కానీ ‘ఖైదీ’ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. సంవత్సరానికి విడుదలవుతున్న 200 సినిమాల్లో సగానికి పైగా యాక్షన్‌ బేస్డ్‌ సినిమాలే. కానీ ప్రేక్షకుల హృదయాల్లో కొన్ని సినిమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ‘ఖాకీ’ లాగా ‘ఖైదీ’ కూడా ఆ జాబితాలో చేరుతుందని మేం బలంగా నమ్ముతున్నాం. అంతే కాదు, డైహార్డ్‌ యాక్షన్‌ జోనర్‌లో సినిమాలు తక్కువగా వస్తోన్న నేపథ్యంలో దాన్ని సాధించే ప్రయత్నమే ఈ ‘ఖైదీ’ అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే మొదటి ఫ్రేమ్‌ నుండి క్లైమాక్స్‌ వరకు సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అదనపు సన్నివేశాలను జోడించకుండా, సినిమా ఫ్లేవర్‌ ఎక్కడా మిస్‌ కాకుండా ఈ సినిమాను నిర్మించాం.

‘ఖైదీ’ కుటుంబ ప్రేక్షకులను ఎంతవరకు ఆట్టుకుంటుంది?

- ‘ఖైదీ’ యాక్షన్‌ బేస్డ్‌ చిత్రం అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులను తప్పకుండా కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే పాటలు, హీరోయిన్‌ కంటే ఈ సినిమాలో ఎమోషన్స్‌ ముఖ్యమైనవి. దీన్ని ‘ఖైదీ’ లో అందంగా, డీప్‌గా చెబుతున్నాం. తన కుమార్తెను మొదటిసారి చూడటానికి పదేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చే ‘ఖైదీ’ ప్రయాణం అని ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఖచ్చితంగా పోరాట సన్నివేశాన్ని కూడా ఇష్టపడతారు. ఖైదీ ఒక ఎమోషనల్‌ యాక్షన్‌ చిత్రం, ఇది వర్గాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ‘దీపావళి’ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆశ్చర్యకరమైన అంశం కూడా ఈ చిత్రంలో ఉంది. మంచి సౌండ్‌ ఎఫెక్ట్‌తో అభిమానులు మంచి థియేటర్లలో చూసినప్పుడు, ఈ చిత్రంలోని ఆశ్చర్యకరమైన అంశం పెద్ద దీపావళి బహుమతిగా ఉంటుంది.

ఈ చిత్రంతో నటుడు కార్తీ స్కోర్‌ చేయడానికి ఎంత స్కోప్‌ ఉంది?

- ‘ఖైదీ’ సినిమాలో కార్తీ నటించిన ‘డిల్లీ’ చాలా బలమైన పాత్ర. మొత్తం చిత్రానికి ఒకే కాస్ట్యూమ్‌, నైట్‌ మోడ్‌లో పూర్తిగా చిత్రీకరించినప్పటికీ, కార్తి నటన ఖచ్చితంగా అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. జీవితకాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ యొక్క బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది?, అతను బయటకు వచ్చినప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తాడు?, డైలాగ్‌ డెలివరీ ఎలా ఉండాలి? వంటి వాటి కోసం కార్తి చాలా హోంవర్క్ చేశాడు. రెండు మూడు సన్నివేశాలు ఆడియన్స్‌ పై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే కార్తి యొక్క భావోద్వేగ నటనకు సహజంగా కన్నీళ్లు వస్తాయి. ముఖ్యంగా, సింగిల్‌ టేక్‌లో కార్తీ నటించిన దాదాపు 3 నిమిషాల ఒక టైట్‌ క్లోజప్‌ సీన్‌ చాలా బాగా వచ్చింది. సినిమాలోని హైలైట్స్‌లో అది ఒకటి. అంతే కాదు, కార్తీ ఎటువంటి డూప్‌ లేకుండా రిస్క్‌ తీసుకొని చేసిన యాక్షన్‌ సన్నివేశాలకు థియేటర్‌లో క్లాప్స్‌ పడతాయి. డిల్లీ పాత్ర ఖచ్చితంగా కార్తి కెరీర్‌లో ఓ బెంచ్‌ మార్కుగా నిలుస్తుంది.

Producer SR Prabhu Interview about Khaidi:

SR Prabhu Talks about Karthi Khaidi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs