Advertisement
Google Ads BL

‘జాతిర‌త్నాలు’ ఫస్ట్ లుక్ విడుదల


స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ నటించిన ‘జాతిర‌త్నాలు’ ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

Advertisement
CJ Advs

నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న ‘మ‌హాన‌టి’ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జాతిర‌త్నాలు’. ‘మ‌హాన‌టి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  జైలు ఖైదీల దుస్తుల్లో క‌న‌ప‌డుతున్నారు. 420, 210, 840 వారి నెంబ‌ర్స్‌గా క‌న‌ప‌డుతున్నాయి. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ సినిమాతో హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్న న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్ ‘బ్రోచెవారెవురురా’లో త‌మ‌దైన కామెడీతో మెప్పించారు. సినిమా ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ర‌ధ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, వి.కె.న‌రేశ్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, మిర్చి కిర‌ణ్, గిరిబాబు, మహాన‌టి ఫేమ్ మ‌హేష్‌ తదితరులు.

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె.వి

నిర్మాత‌: నాగ్ అశ్విన్‌

బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమా

కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్ష గార‌పాటి

మ్యూజిక్‌: ర‌ధ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: సిద్ధం మ‌నోహార్‌

ఎడిట‌ర్‌: అభిన‌వ్ దండ‌

ఆర్ట్‌: చ‌ంద్రిక‌.జి, ఫైస‌ల్ అలీ ఖాన్‌

Jaathi Ratnalu First Look and Motion Poster Launch:

<span>Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna&nbsp;Jaathi Ratnalu details</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs