Advertisement
Google Ads BL

బాలయ్య టీమ్ స్పందించలేదేంటి?


బాలకృష్ణ - కె.ఎస్‌. రవికుమార్‌ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాదు.. అప్పుడే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగింది. అయితే బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్‌ని వదిలేసి.. డిసెంబర్‌లోనే కొత్త సినిమాతో రాబోతున్నాడని, సినిమా గురించి అబ్బో అంటూ వార్తలు రావడమే కానీ... సినిమా టైటిల్ మాత్రం అఫీషియల్‌గా బయటికి రాలేదు. కానీ శాటిలైట్ హక్కులు కొన్న ప్రముఖ ఛానల్ జెమిని వారు మాత్రం బాలయ్య కొత్త సినిమా టైటిల్ ‘రూలర్’ అంటూ ప్రకటించారు. టైటిల్‌ని జెమిని వారు ప్రకటించి చాలా రోజులవుతున్నప్పటికీ.. చిత్ర బృందం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.

Advertisement
CJ Advs

కనీసం ఆ టైటిల్‌తో ఓ అఫీషియల్ పోస్టర్ కూడా బయటికి రాలేదు. ఇక ఈ దీపావళికి ఏమైనా బాలకృష్ణ కొత్త సినిమా పోస్టర్‌తో పాటుగా టైటిల్ బయటికొస్తుందేమో చూడాలి. ఇంతకుముందు బాలయ్య న్యూ లుక్ బయటికి లీకయ్యాక.. హడావిడిగా చిత్ర బృందం బాలయ్య కొత్త సినిమా లుక్ ని విడుదల చేసింది. కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో అలా లేదు. ఇకపోతే బాలకృష్ణ.. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో కనబడడమే కాకుండా సిట్యుయేషనల్ కామెడీ‌తో అలరిస్తాడని టాక్. సినిమాలో కావాల్సినంత యాక్షన్ అలాగే కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు.

Gemini TV Announces Balakrishna and KS Ravikumar Film Title:

Confusion on Balakrishna and KS Ravikumar Film Title 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs