Advertisement
Google Ads BL

హీరోగా ఫీలైన ప్రదీప్.. షాకిచ్చిన ‘మల్లెమాల’!


‘మల్లెమాల’ అదేదో యువతి పేరు అనుకునేరు.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ‘మల్లెమాల’ ప్రొడక్షన్స్. యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుని.. టాప్‌లో నిలిచారు. తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ఈ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్ ఉన్నట్లుండి స్క్రీన్‌పై కనపడకపోయేసరికి అందరూ అసలేం జరిగింది..? ప్రదీప్ ఎక్కడికెళ్లిపోయాడు..? అతనిపై ఎవరైనా కక్ష్యగట్టి పంపారా..? అని ఇలా పలురకాలుగా ఆయన అభిమానులు, ఢీ ప్రేక్షకుల్లో మెదిలాయి. అంతేకాదు కొందరిలో అయితే కొంపదీసి మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికేశాడా..ఏంటి? అని కూడా అనుమానాలు వచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే కాస్త లోతుల్లోకి వెళ్లి వివరాలు సేకరించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తనకు ఫేమ్.. నేమ్ వచ్చేసరికి ఎవరికైనా సరే అత్యాశ పుడుతుంది.. అలాగే ప్రదీప్ కూడా సీనియార్టీ పెరగడంతో కాస్త గట్టిగానే రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకుని అమాంతం పెంచేశాడట. అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమని చెప్పినప్పటికీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ఇచ్చి తీరాల్సిందేనని తిష్టవేసి కూర్చున్నాడట. తనకు తానుగా ప్రదీప్ హీరోగా ఫీలవ్వడంతో.. మల్లెమాల ప్రొడక్షన్స్ ఊహించని షాకిచ్చింది.. అంటే అందుకు ప్రతిఫలం ‘ఢీ’ ప్రోగ్రామ్ నుంచి ఔటవ్వడమే.!.

కాగా.. ఈ రెండు సీజన్లకు టీమ్‌ లీడర్లుగా ఉన్న సుధీర్, రష్మీలు ఇప్పుడు యాంకర్లుగా మారారు. అయితే వీరి రొమాన్స్, జోకులతో జనాలను బాగా ఎంటర్‌టైన్ చేస్తూ షో సాగిస్తున్నారు. ప్రస్తుతానికి వీరితో ఈ సీజన్ చేయించి.. తర్వాత సీజన్‌కు మరో యాంకర్‌ను చూసుకోవాలని మల్లెమాల యాజామన్యం భావిస్తోందట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ప్రదీప్ క్లారిటీ ఇచ్చుకోవాల్సిందే మరి.

Anchor Pradeep Out of The Dhee Champions Behind Reasons:

<h1 class="title style-scope ytd-video-primary-info-renderer">Anchor Pradeep Out of The Dhee Champions Behind Reasons</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs