Advertisement
Google Ads BL

అందుకే ‘అల వైకుంఠ..’తో పోటీ పడటం లేదంట!


దీపావళికి హీరో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మాస్ సాంగ్‌ని అప్పుడే రిలీజ్ చేసాడు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ టీం మాత్రం సైలెంట్‌గా ఉంది. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సామజవరగమనా సాంగ్ ఓ లెవల్లో క్రేజ్ కొట్టేసింది. ఎవరి మొబైల్ రింగ్ టోన్ చూసినా అదే పాట, ఎవరి మొబైల్ కాలర్ ట్యూన్ చూసినా ఇదే పాట. అంతలా ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్ ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ టీం మాత్రం దీపావళికి ఏ పోస్టర్ నో విడుదల చేసి మహేష్ ఫ్యాన్స్‌ని ఉసూరుమనిపించేలా ఉంది. అసలే అపోజిషన్ హీరో అల్లు అర్జున్ దూకుడు మీదుంటే.. మహేష్ మాత్రం సైలెంట్‌గా ఉండడం మహేష్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చడం లేదు.

Advertisement
CJ Advs

అయితే ‘అల వైకుంఠపురములో’ చిత్ర స్పీడు మనకెందుకు.. విడుదలకు ఎక్కువ సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే గట్టి ప్రమోషన్స్ చేసేస్తే.. విడుదల సమయానికి ఇంకేం మిగలవని సరిలేరు టీం భావించబట్టే ఇలా సైలెంట్ గా ఉంటుందట. ఇప్పటినుండే హంగామా అవసరమా అన్నట్టుగా. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 లాంటి హిలేరియస్ కామెడీ సరిలేరులో ఉండడమే కాకుండా.. మహేష్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. మహేష్ దూకుడు సినిమాలో చేసిన కామెడీ ఒక ఎత్తైతే.. సరిలేరులో మహేష్ కామెడీ మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతుందట. కామెడీతో కూడిన యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలెట్ అని... ముందు నుండి అనుకున్నట్టుగా.. ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్‌గా నవ్వించడం ఖాయమని... అలా సినిమాకున్న ప్రచారం క్రేజ్ చాలని.. ఇప్పటినుండే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ‘సరిలేరు నీకెవ్వరు’ టీం భావిస్తోందట.

ఇక టీం అలా సైలెంట్‌గా ఉన్నప్పటికీ... సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని ఐటెం సాంగ్ లిరిక్స్ బందరు మిఠాయి బోర్డరు సిపాయి అంటూ సాగే లిరిక్స్ లీక్ అయ్యాయి. మరి తమన్నా తో మహేష్ చేయబోయే ఐటెం సాంగ్ ఊర మాస్ స్టెప్స్ కి ఈపాట కరెక్ట్ గా సింక్ అవుతుంది. మరి అఫీషియల్ గా ఈ సాంగ్ వదలకపోయినా.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం లీకైన ఐటెం సాంగ్ లిరిక్స్ తోనే పండగ చేసుకుంటున్నారు.

Sarileru Neekevvaru Team Stand on Promotions:

<span>Ala Vaikunthapurramloo in Full Swing with Promotions</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs