Advertisement
Google Ads BL

మహేష్ మార్చమంటే.. డైరెక్టర్స్ నో అంటున్నారు!


కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ చెప్పిన కథలను ఎవరైనా స్టార్ హీరో మార్చమంటే కుదరదని చెప్పేస్తారు. అదే కొంతమంది డైరెక్టర్స్ కి హీరో చెప్పాడని కథలే మార్చేస్తారు. కానీ సుకుమార్ లాంటి డైరెక్టర్ హీరోలకు సరిపడా కథలు సిద్ధం చేసుకుని అదే కథతో సినిమాని పట్టాలెక్కిస్తారు. తాజాగా సుకుమార్ చెప్పిన కథకు మహేష్ మార్పులు సూచిస్తే.. సుకుమార్ సైలెంట్ గా మహేష్ నుండి సైడ్ అయ్యి అల్లు అర్జున్ తో ఆ కథని ఓకే చేయించుకున్నాడు. ఇక్కడ హీరో మారాడు కానీ.. కథ మారలేదు. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ అర్జున్ రెడ్డి కథతో చాలామంది స్టార్ హీరోలను కలవగా వారు చెప్పిన మార్పులు చెయ్యకుండా మొండిగా అదే కథతో విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేసాడు.

Advertisement
CJ Advs

ఇక అర్జున్ రెడ్డి తర్వాత మహేష్‌తో చేద్దామనుకున్న సందీప్.. తన కథని మహేష్ హోల్డ్‌లో పెట్టడంతో.. బాలీవుడ్‌కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయినా.. మహేష్ మూవీ కోసం కథను సందీప్ ఎప్పుడో సిద్ధం చేసాడట.. కాబట్టి వాళ్ళ మధ్యలో సినిమా ఉంటుందనే ప్రచారం నెలకోసారి జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సందీప్ చెప్పిన కథకి మహేష్ కొన్ని మార్పులు చెయ్యమనగా.. దానికి సందీప్ వంగా తలొగ్గలేదని.. అందుకే మహేష్ నుండి సందీప్ సైడ్ అయ్యాడని, మహేష్ మాట భేఖాతర్ చేసిన దర్శకుడు అంటూ ప్రచారం మొదలైంది. సందీప్ వంగా చెప్పిన కథ నచ్చిన మహేష్ కేవలం సెకండ్ హాఫ్ లో చెప్పిన మార్పులను కూడా సందీప్ ఒప్పుకోకపోవడంతో.. ఇక మహేష్ - సందీప్ కాంబో మూవీ పట్టాలెక్కదని.. అందుకే మహేష్ తన తదుపరి చిత్రం కోసం కెజిఎఫ్ దర్శకుడిని లైన్‌లో పెట్టబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. 

One More Director Says No to Mahesh Babu:

Directors Unhappy with Mahesh Babu decisions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs