Advertisement
Google Ads BL

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్


వరల్డ్‌వైడ్‌గా అభిమానుల ఆదరణ అందుకుంటూ సంచలన విజయాలు సాధిస్తున్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి హ్యాపీ బర్త్‌డే

Advertisement
CJ Advs

టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సత్తాతో బాలీవుడ్‌కే కాదు.. హాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఔరా! అనిపించిన మన బాక్సాఫీస్‌ బాహుబలి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కటౌట్‌ను చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌... అనేంతలా ఆరడుగుల పైన హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌ ప్రభాస్‌ సొంతం. టాలీవుడ్‌ చిత్రసీమ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే సినిమాను చేయాలనుకున్నారు. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన కథ ‘బాహుబలి’. అయితే ఇండియన్‌ సినిమా రేంజ్‌ను పెంచేలా ఓ హీరో కావాలనుకున్నప్పుడు దానికి సరిపోయే హీరోగా దొరికిన ఆప్షన్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ నటనకు తెలుగు సినిమానే కాదు.. బాలీవుడ్‌ ప్రేక్షకులు, విమర్శకులు శభాష్‌ అన్నారు. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే కాదు.. దాన్ని మించేలా సినిమాలు చేయగల రేంజ్‌ టాలీవుడ్‌ కి ఉందని తెలిసింది.

బాహుబలి తర్వాత ఆల్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఈస్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడ్డారు. పదిహేడేళ్లకు పైగా ఆయన కష్టం, అంకిత భావం, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

ఐదేళ్ల కృషితోనే నేషనల్‌ స్టార్‌

తెెలుగు సినిమా అంటే ఓ రీజనల్‌ సినిమా అనే భావన ఎక్కువ. అసలు సాంకేతికతకు ఆమడ దూరంలో తెలుగు సినిమాలు ఉంటాయని ఇతర సినిమా పరిశ్రమలు ఆలోచనలకు వచ్చేశారు. అయితే ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే అని నేటి తరం టాలీవుడ్‌ యువ దర్శకులు క్రమంగా చాటే క్రమంలో తెలుగు సినిమా దర్శకులకు, నిర్మాతలకు కొత్త ఊపిరినిచ్చిన సినిమా ‘బాహుబలి’. అప్పటి వరకు టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాజమౌళి తెలుగులో చేసిన కొత్త ప్రయోగం. సరే! ఆయన దర్శకుడు ఆయన ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తాడు. మరి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచే హీరో కూడా ముఖ్యం కదా. అది కూడా ఎమోషన్స్‌, హీరోయిజం ఉన్న పాత్రను క్యారీ చేయడం కత్తి మీద సామే. అలాంటి పాత్ర బాహుబలి సినిమాలోనిది. ఇలాంటి ఓ సినిమాను తెరపై ఆవిష్కరించడం అంత తేలికైన విషయం కాదు. కానీ రాజమౌళికి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అండగా నిలబడ్డారు. సినిమాను రెండేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. రేండేళ్లు కాస్తా ఐదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించకుండా ఓ కమిట్‌మెంట్‌తో బాహుబలిని ప్రభాస్‌ పూర్తి చేశారు. ప్రభాస్‌ తపన, రాజమౌళి కృషి కలయికే ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. బాహుబలి రిలీజ్‌ ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్‌ ఓ వందకోట్లు ఉంటే.. రిలీజ్‌ తర్వాత ఆ రేంజ్‌ పాతిక రేట్లు పెరిగింది. దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసే ఉత్తరాది పరిశ్రమ ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌.

‘బాహుబలి’తో అంతర్జాతీయ గుర్తింపు 

బాహుబలితో నేషనల్‌ హీరోగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో కూడా పలు వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. అందుకోసం 350 ఛాయా చిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించడం విశేషం.

‘సాహో’తో మరోసారి బాక్సాఫీస్‌ షేక్‌

బాహుబలితో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో రూ.350కోట్లతో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్‌ వేల్యూస్‌తో ప్యాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన చిత్రం ‘సాహో’. బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ నటించింది. పలువురు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, మందిరా బేడి సహా ప్యాన్‌ ఇండియా నటీనటులు, ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై ప్రభాస్‌ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది హయ్యస్ట్‌ గ్రాసర్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌లో రూ. 153కోట్ల వసూళ్లను సాధించి మరోసారి అక్కడ ప్రభాస్‌ తన సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా 425 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.

ఆసక్తి రేపుతున్న ఫ్యూచర్‌ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌

రెండు వరుస బ్లాక్‌బస్టర్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నెలాఖరు నుండి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ప్యాన్‌ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా సినిమాకు హీరోగా తన రేంజ్‌ను పెంచుకుంటున్న ప్రభాస్‌ ఇమేజ్‌ యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌లో అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని పలకరించే ప్రభాస్‌ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్‌ చేయాలనుకుంటారు. అలాంటి రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23. ఈ సందర్భంగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Young Rebel Star Prabhas Birthday Special Article:

Prabhas Greatness Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs