Advertisement
Google Ads BL

నాన్నకు ప్రేమతో.. చెర్రీ ఎంత ఇచ్చుకున్నారో!


మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు రాం..రాం చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి మళ్లీ పాత రోజులొచ్చాయ్.. ఇక ‘నాకు నేనే సాటి.. నాకెవ్వరు లేరు పోటీ.. మళ్లీ మెగాస్టార్‌కు టైమ్ వచ్చేసిందహో’ అంటూ తన రేంజ్‌ను టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు చిరంజీవి చాటుకుంటున్నారు. రీ ఎంట్రీ ‘ఖైది నెం.150’, తాజాగా..‘సైరా’ రెండు సినిమాలో సూపర్ డూపర్ హిట్టే అయ్యాయి. ఇంతవరకూ అంతా ఓకే గానీ కొద్దిరోజులుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. పైన చెప్పిన రెండు సినిమాలు చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు కదా.. మరి ఆయన ఎంత పారితోషికం తీసుకొని ఉంటారు..? అసలు తీసుకుంటాడా.. లేదా? ఒకవేళ తీసుకొని ఉంటే చెర్రీ ఎంత ఇచ్చుకున్నారు..? మెగాస్టార్ ఎంత పుచ్చుకున్నారు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Advertisement
CJ Advs

అయితే..‘నాన్నకు ప్రేమతో’ అంటూ చిరంజీవికి.. ఖైదీ నంబర్-150 సినిమాకు గాను రూ. 30 కోట్లు.. ‘సైరా’ సినిమాకు రూ. 45 కోట్లు చెర్రీ చెల్లించారట. తాజాగా మొదలైన కొర‌టాల శివ‌ సినిమాకు రూ. 50 కోట్ల పారితోషికం అందుకుంటారని టాలీవుడ్‌లో గట్టిగా టాక్ నడుస్తోంది. అదేదో అంటారు కదా.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని అలాగే.. సినిమా సినిమానే.. తండ్రి తండ్రే.. రెమ్యునరేషన్.. రెమ్యునరేషనే అన్న మాట. మరి ఇందులో ఏ మేరకు నిజానిజాలున్నాయో చిరు.. చెర్రీలకే తెలియాల్సి ఉంది.

Chiru’s Remuneration For Sye Raa.. Here Details..!:

Chiru’s Remuneration For Sye Raa.. Here Details..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs