Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ తర్వాత రీమేక్ మూవీలో నాగ్!


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున నవంబర్‌లో బాగా బాగా బిజీబిజీ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్-3 షో వ్యాఖ్యతగా ఉన్న మన్మథుడు.. అది కాస్త పూర్తవ్వగానే హిందీ రీమేక్‌లో చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement
CJ Advs

వాస్తవానికి ఈ మధ్య నాగ్‌కు గట్టి పడి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో ‘సోగ్గాడే చిన్నినాయన’ హిట్టవ్వగా.. కొన్ని నెలల క్రితం వచ్చిన ‘మన్మథుడు-2’ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో నాగ్‌ ఇమేజ్‌ చాలా తగ్గింది.. అయితే ఆ లోటు కాస్త బిగ్‌బాస్‌తో పూడ్చుకున్నారు.. అది ఫేమా..? పైసలా..? అనేది ఇక్కడ అనవసరం. ఈ షో అవ్వగానే.. తనకు ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో.. నాగ్-నాగ్ చైతన్య కాంబినేషన్‌లో ‘బంగర్రాజు’ సీక్వెల్ సినిమా తెరకెక్కించాలని భావించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించనుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో ఈ సినిమాను మొదలుపెట్టి.. వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజుని విడుద‌ల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే మధ్యలో ఈ హిందీ రీమేక్ అని టాక్ వచ్చింది. మరీ ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? హిట్టిచ్చిన దర్శకుడికి ఏం చెప్పి నాగ్ మేనేజ్ చేస్తాడో వేచి చూడాల్సిందే మరి.

Nagarjuna Acts In Hindi Remake Movie After Bigg Boss Completion!:

Nagarjuna Acts In Hindi Remake Movie After Bigg Boss Completion!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs