టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శి జీవిత ఓ వీడియో రూపంలో వివరణ ఇవ్వగా.. తాజాగా.. ఇందుకు కౌంటరిస్తూ.. మాటకు మాట అన్నట్లుగా ‘మా’ అధ్యక్షుడు నరేశ్ వీడియో చేశారు. ‘మా’ తరఫున ఎలాంటి సభలు జరిగినా అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి. ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ చూడలేదు. సమావేశానికి హాజరు కావాలంటూ 25 రోజుల క్రితం నాకు ఓ లేఖ వచ్చింది. అధ్యక్షుడిగా జనరల్ బాడీ సమావేశానికి సభ్యులను ఆహ్వానించాల్సింది నేను.. కానీ నన్నే మరెవరో పిలవడం ఏంటి.?’ అని తాను ఆశ్చర్యపోయానని నరేశ్ చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని ఆయన.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో తాను ఒకే ఒక్కసారి సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు మూడు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కూడా నిర్వహించానని.. కానీ ఇప్పుడు జరిగిన మీటింగ్‌పై చాలా అనుమానాలు ఉన్నాయని అందుకే తాను హాజరుకాలేదని నరేశ్ చెప్పారు.
అయితే జీవిత మాత్రం.. మా సభ్యుల్లోని 900 మందిలో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుందని.. అప్పుడే మా సమస్యలు పరిక్షరించుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ అధ్యక్షుడి చేతులమీదుగా జరగాలి కానీ.. జీవిత మాత్రం మొత్తం తానే లీడ్ తీసుకుని చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ వివాదం మరింత ముదురుతోందే తప్ప.. ముగింపు లేనట్లుంది. మరి మున్ముంథు ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో..? ఎప్పుడు ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడతాయో వెయిట్ అండ్ సీ.!