Advertisement
Google Ads BL

అక్టోబర్ 25న ‘ప్లానింగ్’ గ్రాండ్ రిలీజ్!!!


మ‌హేంద్ర- మ‌మ‌త కుల‌క‌ర్ణి  హీరోహీరోయిన్లుగా బి.ఎల్.ప్రసాద్ ద‌ర్శక‌త్వంలో సాయి గ‌ణేష్ మూవీస్ ప‌తాకంపై టి.వి.రంగ‌సాయి నిర్మించిన చిత్రం ‘ప్లానింగ్’. ప్రత్యేక పాత్రలో అలీష న‌టించారు. ఉద‌య్ కిర‌ణ్ సంగీతం అందించారు. అక్టోబర్ 25న విడుదలవుతున్న సందర్భంగా హైద‌రాబాద్ ఫిలిం ఛాంబర్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించింది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. రంగసాయిగారు చాలా కష్టపడి సినిమా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీగా థియేటర్స్ ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’ అన్నారు.

కొరియోగ్రాఫ‌ర్ కమ్ హీరో మహేంద్ర మాట్లాడుతూ.. ‘మా దర్శకుడు నిర్మాతలు ఎంతో చ‌క్కని ప్లానింగ్ తో చేసిన సినిమా ఇది. ఆశీస్సులు అందించిన పెద్దల‌కు, అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన అంద‌రికీ ధ‌న్యవాదాలు’ అన్నారు. 

క‌థానాయిక మమత కులకర్ణి మాట్లాడుతూ.. ‘ద‌క్షిణ భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు చేశాను. ఐటెమ్ గీతంతో కెరీర్ ప్రారంభించి క‌థానాయిక‌ను అయ్యాను. ఈ చిత్రంలో అద్భుత‌మైన పాత్రలో అవ‌కాశం ఇచ్చారు. ద‌ర్శక‌నిర్మాత‌ల‌కు, ఆశీస్సులు అందించిన‌ పెద్దలంద‌రికీ ధ‌న్యవాదాలు’ అన్నారు. 

దర్శకుడు బి.ఎల్.ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో కష్టపడి తెరకెక్కించారు. నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. అయితే దొరికిన  కొన్ని  థియేటర్స్ కి తృప్తి పడాల్సి వస్తోంది. సినిమా విడుదలయ్యాక  నెక్స్ట్ వీక్ థియేటర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నాను’ అన్నారు. 

నిర్మాత రంగ సాయి మాట్లాడుతూ.. ‘ దర్శకుడు ప్రసాద్ ప్రతీ ఫ్రేమ్‌ని అందంగా తీర్చిదిద్దారు. చక్కని సంగీతం కుదిరింది. సెన్సార్ నుండి యూ బై ఏ వచ్చింది. 25న సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రముఖ పంపిణీదారులు  రాజేంద్ర విడుదల చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ మోహన్ వడ్లపూడి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో సహనిర్మాత దనుంజయ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్, ఎడిటర్ నాగు, పంపిణీదారులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు:- 

రంగ‌సాయి, ఉరుకుంద‌ప్ప, అస్మిత‌, ఆదిత్య చైత‌న్య, సంతోష్‌, సుప్రీం సాయి, తిరుమ‌ల‌రావు, విజ‌య్ కుమార్, శంక‌ర్, బార్బీ, అనూష‌, ప‌వ‌న్ కుమార్, ల‌క్ష్మి, ధ‌న‌ల‌క్ష్మి, ప్రిన్స్ వేణు, రాజేష్, విన‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.  స‌హ‌నిర్మాత‌లు:  బి.ధ‌నుంజ‌య్, బి.దేవి

సినిమాటోగ్రఫీ: ఏడుకొండలు (ఆర్యన్ ) 

ఎడిట‌ర్:  నాగు

కొరియోగ్రఫీ: బ‌షీర్

ఫైట్స్:  వాసు,

నిర్వహ‌ణ‌:  బి.భూల‌క్ష్మి

నిర్మాత: రంగసాయి

దర్శకత్వం: బి.ఎల్.ప్రసాద్

Planning movie grand release on october 25th:

Planning movie grand release on october 25th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs