Advertisement
Google Ads BL

బరువు తగ్గడానికి బన్నీ ఏం చేసాడో తెలుసా?


‘నా పేరు సూర్య’ సినిమా టైమ్‌లో బాగా ఫిట్‌గా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ రావడంతో కాస్త బరువు పెరిగాడు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ‘అలా వైకుంఠపురములో’ సినిమా టైమ్‌కు అల్లు అర్జున్ కాస్త బరువు పెరిగాడట. తన బరువు తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడినట్లుగా టాక్. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కష్టతరమైన వర్కౌట్స్ చెయ్యడమే కాకుండా... ‘కీటో డైట్‌’ ఫాలో అయినట్లుగా చెబుతున్నారు. దాదాపు 4 నెలల పాటు బన్నీ కీటో డైట్‌ని ఫాలో అవడంతో చాలా వెయిట్ తగ్గాడట.

Advertisement
CJ Advs

చాలా రోజులు కాదు నెలల పాటు.. కార్బోహైడ్రేట్లు ఉన్నప్పడే అల్లు అర్జున్ తీసుకోలేదట. కేవలం 4 నెలలోనే బన్నీ 10 నుండి 14 కిలోల బరువు తగ్గి ‘అల వైకుంఠపురంలో..’ సినిమా కోసం ఫిట్‌గా న్యూ లుక్‌లోకి మారాడట. మరి ‘అల వైకుంఠపురములో..’ భారీ ప్రమోషన్స్‌తో సంక్రాంతికే విడుదలవడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మరీ కొత్త లుక్ ట్రై చేయకపోయినా.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కి సరిపోయే లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్‌లో బన్నీ కాస్త డిఫ్రెంట్‌గానే కనపడతాడని తెలుస్తోంది.

Bunny follows Keto Diet To lose Weight!:

Bunny follows Keto Diet To lose Weight!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs