Advertisement
Google Ads BL

ప్లాప్ లపై హీరో విశ్లేషణ!!


సాయికుమార్ కొడుకు ఆది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంతవరకు ఆది కమర్షియల్‌గా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. రీసెంట్‌గా చేసిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కి మిక్స్డ్ టాక్ రావడంతో ఇది కూడా ప్లాప్ కిందే పరిగ్రమిస్తున్నారు ట్రేడ్ నిపుణులు. ఉండటానికి రెండు మూడు హిట్స్ ఉన్నాయి కానీ అవేమీ ఆది కెరీర్‌పై ప్రభావం చూపలేదు.

Advertisement
CJ Advs

అసలు ఆదికి ఎక్కువ ఫ్లాప్‌లు ఉండటానికి గల కారణాలు ఏంటో విశ్లేషించుకున్నాడట. ఆది ఎక్కువగా తన సినిమాల్లో కమర్షియాలిటీ ఉండే విధంగా చూసుకుంటాడు. ఎటువంటి కథయినా కమర్షియల్‌గా ఉండేలా.. ఎంటర్‌టైన్మెంట్ స్క్రీన్ ప్లేతో చేస్తున్నాడట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలను ఎంపిక చేసుకున్నప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌తో కాకుండా సీరియస్‌గా స్క్రీన్ ప్లేను నడిపించినట్లయితేనే సినిమాకు మంచి టాక్ వచ్చి తనకు కొంత ప్లస్ అవుతుందని భావించి ఇక నుంచి మంచి కథను నమ్ముకుని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడట. మరి ఆది ఇకపై ఎటువంటి సినిమాలు, ఎటువంటి కథలు ఎంచుకుంటాడో చూడాలి.

Actor Aadi Analyze On His Flop Movies!:

Actor Aadi Analyze On His Flop Movies!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs