Advertisement
Google Ads BL

తాప్సి మాట మీద నిలబడదా?


 

Advertisement
CJ Advs

ఇక్కడ కొన్ని సినిమాలు చేసి వెంటనే బాలీవుడ్‌కి వెళ్ళిపోయి అక్కడ ఒక హిట్ పడగానే ఇక్కడ సౌత్ మేకర్స్‌ను విమర్శించడం, వారిపై సెటైర్లు వేయడం ఈ మధ్య మన హీరోయిన్స్‌కి ఫ్యాషన్ అయిపోయింది. ఇందులో మొదటగా మనకి గుర్తొచ్చే పేరు తాప్సి. ఈమె అక్కడికి వెళ్లి చేసిన రచ్చ అంత ఇంత కాదు. సౌత్‌లో తనకు అన్యాయం జరిగిందని, సరైన పాత్రలు చేయలేదని చెప్పింది.

అయితే లేటెస్ట్‌గా తాప్సి ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం స్వరం మార్చేసింది. ‘కొందరు చెప్పిన మాటలు విని తెలుగు లో సినిమాల ఎంపికలో తప్పులు చేశాను. నా కెరీర్ ఆరంభంలో ఎలా నటించాలో, ఎటువంటి సినిమాలు చేయాలో నాకు తెలియలేదు. కొందరు హీరోయిన్స్ నాకు.. నువ్వు ఈ సినిమా చేయాలి. ఈ పాత్ర చేయాలి అని చెప్పడంతో ఏమి ఆలోచించకుండా చేసేసాను. అవి వేరే హీరోయిన్లకు ఓకే కానీ.. నాకు అలాంటి సినిమాలు వర్కవుట్ కావని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు నా సొంత బుర్ర ఉపయోగించి సినిమాలు చేస్తున్నాను’ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింంది. కాగా.. తాప్సీ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేయడం లేదన్న విషయం విదితమే.

taapsee change her voice over south film industry:

taapsee change her voice over south film industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs