Advertisement
Google Ads BL

‘డిస్కో రాజా’ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన


మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎస్పీ బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తారు.

Advertisement
CJ Advs

సాంగ్ లిరిక్:-

పల్లవి:- 

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో !

బదులేదో ఎం చెప్పాలో ఏమనుకున్నానో !!

భాషంటూ లేని భవాలేవో నీ చూపులో చదవనా !

స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా !!

ఎటు సాగాలో అడగని ఈ గాలితో !

ఎపుడాగాలో తెలియని వేగాలతో !!

చరణం 1:-

నీలాల నీ కనుపాపలో యె మేఘసందేశమో

ఈనాడిలా సావాసమమై అందింది నీ కోసమే 

చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్లకి

నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం తీర్చేసావేమో ఈ నాటికి

మౌనరాగాలు పలికే స్వరగాలతో మందహసాలు చిలికే పరాగలతో

భాషంటూ లేని భవాలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసును తాకేనా

చరణం 2:-

నీ కురులలో ఈ పరిమళం నన్నళ్ళుతూ ఉండగా

నీ తనువులో ఈ పరవశం నన్నేను మరిచేంతగా

రెప్పల్లో మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం

రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వప్నలెన్నెన్నో కని పెంచుదాం

మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో హాయిగా అలసిపోతున్న ఆహాలతో 

భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా

న‌టీన‌టులు:- 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:- 

బ్యానర్ : ఎస్‌ఆర్‌టి ఎంట‌ర్ టైన్మెంట్స్

ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి

సమర్పణ - సాయి రిషిక

నిర్మాత : రజిని త‌ళ్లూరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్. ఎస్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి

కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

News About Disco Raja Song:

News About Disco Raja Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs