Advertisement
Google Ads BL

‘ఖైదీ’ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది: కార్తీ


యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నసందర్భంగా హీరో కార్తీ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది?

- లోకేష్ కనకరాజ్‌ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు. ఫస్ట్ మూవీతోనే చాలా పెద్ద హిట్ అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది ఒకసారి వినండని చెప్పారు. సినిమా మొత్తం మాస్ ఉంటుంది. యాక్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక రాత్రి  జరిగే నాలుగు గంటల్లో పూర్తి సినిమా ఉంటుంది. ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందనిపించింది. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

- ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చే ఒక ‘ఖైదీ’ క్యారెక్టర్. తాను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. తను ఎలా ఉంటుందో  కూడా తెలీదు. అన్ని అవాంతరాలని దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ. ఇదొక బిగ్ యాక్షన్ ఫిలిం. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే నాకు కూడా పెర్ఫామెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనిపించింది.

మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సందర్భమేమిటి?

- నాకు ఒక కూతురు ఉండడం వల్ల నాన్నగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో విక్రమార్కుడు మూవీ ని తమిళ్ లో రీమేక్ చేసే టప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేదు కాబట్టి అంతా హ్యాపీ గానే జరిగింది. 

ట్రైలర్‌లో డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది కదా! సినిమాలో మరిన్ని డైలాగ్స్ ఉన్నాయా?

- తప్పకుండా ఉన్నాయి. ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ రేపు సినిమాలో డైలాగ్స్ కి  మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్ గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలిం లా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్ గా ఉంటుంది. ఇదొక యూనిక్ కాంబినేషన్. అతను ఎవరు? అతని గతం ఏంటి అనేది మోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

చిరంజీవి గారి ఖైదీ మూవీ కూడా అక్టోబర్ 28 నే రిలీజయింది కదా?

- ఆ విషయం నాకు తెలీదండి! కాక పొతే ఇది చాలా మంచి విషయం. ఆ సినిమా లాగే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో నాతో పాటు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్  ఉంటాయి. ఫేమస్ ఆర్టిస్టులు  నటించారు. 

మ్యూజిక్ గురించి?

 - ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోను ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది న్యూ థాట్. అందులోనూ ఒక హాలీవుడ్ మూవీలాగే మ్యూజిక్ ఇచ్చారు. మాములుగా ఇలాంటి సినిమా రెండు గంటలే ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్ గా 2 - 20 పెడుతున్నామంటే తప్పకుండా సరిపోయేంత థ్రిల్ ఉన్న కంటెంట్ ఉంది.

ఖాకి సినిమా విజయం ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం ఇచ్చింది అనుకోవచ్చా?

- అలా అనేం లేదండి. తెలుగులో కూడా కొత్త కొత్త కథలతో థ్రిల్లర్  సినిమాలు వస్తున్నాయి, అర్జున్ రెడ్డి,  అడవి శేష్ స్టైలిష్ థ్రిలర్ ఎవరు కూడా మంచి సక్సెస్ సాధించింది.  అందులోను డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరఅయింది. ఇలాంటి సందర్భం లో ఖైదీ లాంటి సినిమా చేసే అవకాశం ఒక్కసారే వస్తుంది.  నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే టప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది. 

ఈ సినిమా కోసం ఎలాంటి రీసర్చ్ చేశారు?

- ఈ సినిమాకు సంబంధించి మేము నిజంగా ఖైదీ లను కలవడం జరిగింది. డైరెక్టర్ వారిని కలిసినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలు లో ఉన్న ఖైదీలు బయటకు వచ్చి వైట్ కలర్ చూస్తే చాలా హ్యాపీ గా ఉంటుంది అని చెప్పారు.

ఒక స్టోరీ సెలక్షన్ అప్పుడు తెలుగు ఆడియన్స్ కి దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేస్తారా?

- అందరూ ఆడియన్సే కదండీ, అలా ఏం లేదు కానీ ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటాను. అంతేకాని అలా ప్లాన్ చేసి సెలెక్ట్ చేస్తే వెరైటీ చేయడం చాలా కష్టం.

సినిమా మొత్తం నైట్ షూట్ చేశారా?

- అవునండీ! మొత్తం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ కి విజయ్ గారితో సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

- జీతూ జోసెఫ్ గారితో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నాను. దానిలో మా వదిన జ్యోతిక గారు కూడా నటిస్తున్నారు. చాలా మంచి కథ. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యాంగ్రీ హీరో కార్తీ.

Karthi exclusive interview:

Hero karthi khaidi interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs