Advertisement
Google Ads BL

‘మా’లో మళ్లీ మొదలైంది వార్..!


‘మా’లో లుకలుకలు అంటూ గత కొంతకాలంగా మీడియాలో హాట్ హాట్‌గా ప్రచారం జరుగుతూనే ఉంది. నరేష్ ‘మా’ అధ్యక్షుడు అయ్యాక కూడా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా చాలా విషయాల్లో నరేష్ వర్గంతో విభేదిస్తూనే ఉన్నాడు. జీవిత రాజశేఖర్ కూడా నరేష్‌తో విభేదించడంతో ‘మా’లో జరుగుతున్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా ప్రచారం జరుగుతున్నాయి. మధ్యలో మా సభ్యులు రాజశేఖర్ వంటి వాళ్ళు.. ‘మా’లో గొడవలేం లేవు.. వినిపిస్తున్నవన్నీ పుకార్లే అని కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఆ విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.

Advertisement
CJ Advs

తాజాగా మా జనరల్ బాడీ మీటింగ్‌లో కొంతమంది మా మెంబెర్స్ కంటతడి పెట్టుకుంటూ మీటింగ్ నుండి వెళ్లిపోవడం చూస్తుంటే.. ఆ విభేదాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధమవుతుంది. జనరల్ బాడీ మీటింగ్ కోసం సన్నాహాలు చేస్తే... ఆ మీటింగ్ మా అధ్యక్షుడు అడ్డు చెప్పడమే కాదు... కోర్టు నుండి తన లాయర్ల ద్వారా.. దానికి సమాధానంగా జీవిత రాజశేఖర్‌లు ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, జనరల్ మీటింగ్ అని నరేష్ లాయర్లకు రిప్లై పంపి.. యధావిధిగా ఈ రోజు జనరల్ మీటింగ్ ఏర్పాట్లు చేసారు. 

అయితే ఈ మీటింగ్‌లో శివాజీ రాజా, రాజశేఖర్ వర్గీయులు మధ్య మాటల యుద్ధం జరగడంతో.. కొంతమంది మా సభ్యులు కంట తడిపెడుతూ.. ఆ మీటింగ్ నుండి వాకవుట్ చెయ్యగా... మిగతా వారు ఇంకా మీటింగ్‌లోనే ఉన్నారు. అసలు ‘మా’ సభ్యుల మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ‘మా’ చీఫ్ అడ్వైజర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు. మొత్తానికి ‘మా’ మరోసారి హాట్ హాట్ ఆర్గ్యుమెంట్స్‌తో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతోంది.

MAA: War Between Rajasekhar and Naresh VK:

Again war in Movie Artists Association 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs