Advertisement
Google Ads BL

ఈసారి హీరోయిన్‌కి ఏం లోపం పెట్టాడో?


త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్‌లతో పాటుగా.. హీరోయిన్స్‌కి ఏదో ఒక వీక్ నెస్(లోపం) ఉండడం గమనిస్తూనే ఉన్నాం. కామెడీ పంచ్‌లు పేల్చడమే కాదు.. హీరోయిన్స్‌కి ఇంపార్టెన్స్ రోల్స్ ఇస్తూ.. వాళ్ళ అమాయకత్వంతో మాట్లాడే మాటలకూ ప్రేక్షకులు పడిపోవాల్సిందే. గతంలో జల్సా సినిమాలో ఇలియానాని హాట్‌గా చూపిస్తూనే ఆమెలోని తింగరితనాన్ని ఆమె మాటల్తో చేష్టలతో నవ్వించాడు. ఇక జులాయి సినిమాలోనూ ఇలియానాకి తింగరి తనం ఎక్కువ, తెలివితేటలు తక్కువ. అంతేనా సన్నాఫ్ కృష్ణమూర్తి లోను సమంతని హాట్ గా గ్లామర్ గా చూపిస్తూనే ఆమెకి డయాబెటిస్ వ్యాధి ఉందని అందుకే చాక్లెట్స్ తింటూ అమాయకంగా ఉండేలా చూపించాడు. ఇక త్రివిక్రమ్ మొదటి డిజాస్టర్ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కి అసలు మెదడు ఉందో.. లేదో.. అనే డౌట్ కొట్టే తెలివితేటలు ఉంటాయి.

Advertisement
CJ Advs

మరి అరవింద సమేత లో హీరోయిన్ పూజా హెగ్డేని గ్లామర్‌గా మంచి తెలివైన అమ్మాయిలా చూపించిన త్రివిక్రమ్.. అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటివరకు బయటికొచ్చిన ఫొటోస్‌లో పూజ హెగ్డే బాక్సింగ్ పాపలా మెరిసిపోతుంది. అంటే పూజా హెగ్డేకి ఎలాంటి అమాయకత్వంగానీ, తింగరితనం కానీ, సిల్లీ జబ్బులను కానీ త్రివిక్రమ్ పెట్టాడని అని అనిపించడం లేదు. మరి పూజా ని పూజలాగే అందంగా చూపిస్తాడో లేదంటే... మరేదన్న లోపాన్ని పూజకి త్రివిక్రమ్ తగిలిస్తాడో చూడాలి.

Doubts on Pooja Hegde Role in Ala Vaikunthapurramloo:

Trivikram Srinivas strategy on Heroines
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs