Advertisement
Google Ads BL

‘అల’లా దూసుకెళుతున్నవారికి సరిలేరు ఎవ్వరూ?


ఎఫ్‌2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మహర్షి‌తో సాలిడ్ హిట్ కొట్టిన మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని తట్టుకోవాలి అంటే... ఎంత స్ట్రాటజీ, ఎంత నేర్పు, ఎలాంటి ప్రమోషన్స్ ఉండాలి. అసలే నా పేరు సూర్య లాంటి డిజాస్టర్‌తో ఉన్న అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా. ఆ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉండాలి. అందుకే త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ లు పక్కా ప్రమోషన్స్ ని, పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అందుకే 25 లక్షలు ఖర్చు పెట్టిమరీ అదిరిపోయే ప్రమోషనల్ సాంగ్ ని థమన్‌తో, సిద్ శ్రీరామ్‌తో కలిపి వదిలారు. ఆ సాంగ్ ఇప్పటివరకు తెలుగు పాటలు సాధించలేని వ్యూస్ తో యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఒకేఒక్క పాటతో సరిలేరుకి చుక్కలు చూపించిన అల వైకుంఠపురములో టీం ఇప్పుడు మరో మాస్ బీట్ ని ప్రత్యేకంగా వదలడానికి రెడీ అయ్యింది. ఈ మాస్ సాంగ్ ని దీపావళి కానుకగా విడుదల చేయబోతుంది. ఈ సాంగ్ కి కూడా భారీ ఖర్చుతో ప్రమోట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి అల వైకుంఠపురములో దాడిని ఎదుర్కోవడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పోస్టర్స్ అయినా, టీజర్ అయినా రెడీ అవుతుందో లేదో కానీ... అల టీం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సంక్రాంతికి ఫుల్ మీల్స్ సినిమాగా అల వైకుంఠపురములో సినిమాని త్రివిక్రమ్ తీర్చిదిద్దుతున్నాడు. అల్లు అర్జున్ స్టయిల్, త్రివిక్రమ్ మ్యానరిజం, పంచ్ డైలాగ్స్ ముందు సరిలేరు నీకెవ్వరుకి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తే క్రేజ్ వస్తుందో చూడాలి. మరి ‘అల’ ఉప్పెనలా వచ్చిపడుతుంటే.. సరిలేరు మాత్రం సైలెంట్‌గా ఉంది.

Ala Vaikunthapurramloo vs Sarileru Neekevvaru:

Intelligent Promotions to Ala Vaikunthapurramloo Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs