Advertisement
Google Ads BL

‘రాజుగారి గది 3’నే కాస్త బెటర్..!


ఈ శుక్రవారం మూడునాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజుగారి గది సీక్వెల్ రాజుగారి గది 3, అది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్ళీ మళ్ళీ చూసా, కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాల్లో రాజుగారి గది 3 సినిమా గురించే ప్రేక్షకులకు అంతో ఇంతో తెలుసు. ఎందుకంటే ఆ సినిమాకి ఓంకార్ దర్శకుడు, కాస్త పేరున్న హీరోయిన్ అవికా గోర్ కావడంతో సినిమాపై ప్రేక్షకులు అంతో ఇంతో ఆసక్తి చూపడంతో... ప్లాప్ టాకయినా కోటి ఇరవై లక్షల షేర్ ఓపెనింగ్ రోజు రాబట్టింది. ఇక ప్రస్తుతం భారీ ప్లాప్స్‌తో మార్కెట్ పరంగా జీరో అయిన ఆది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకి అస్సలు ప్రమోషన్స్ లేవు. ఈ సినిమాని వినాయకుడు దర్శకుడు అడవి సాయి కిరణ్ తెరకెక్కించడం, ఆది హీరో అయినా సినిమాకి అస్సలు క్రేజ్ లేదు. కారణం ప్రమోషన్స్ లేవు. ఆ సినిమాకి ప్లాప్ టాక్ ఇచ్చారు క్రిటిక్స్, ప్రేక్షకులు ఇద్దరు.

Advertisement
CJ Advs

ఇక మళ్ళీ మళ్ళీ చూశా సినిమా కానీ, కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాలలో కొత్తవారు నటించారు. ఈ రెండు సినిమాలు చిన్నవే కావడంతో పెద్దగా ఇంఫాక్ట్ బాక్సాఫీస్ వద్ద పడలేదు. వీటిలో యావరేజ్ కలెక్షన్స్‌తో రాజుగారి గది 3 ఈ వారం పర్వాలేదనిపించే సినిమాగా వుంది. ఇక ఆపరేషన్ గోల్డ్ ఫిష్, రాజుగారి గది 3 కన్నా కాస్త బెటర్‌గా, దేశభక్తిపై తెరకెక్కిన సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించలేకపోతోంది.

Box Office Report on Friday Release Movies:

Raju Garu Gadhi 3 Collection Better at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs