Advertisement
Google Ads BL

‘సామజవరగమన’.. రికార్డులు ఆపతరమా!


అల వైకుంఠపురంలో ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’. తెలుగులో ఒక సాంగ్ కు 700K లైక్స్ రావడం ఇదే ప్రధమం.

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.

ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313కె లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్‌కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం. సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రధమం.

‘అల వైకుంఠపురములో’ని తారలు:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు:

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Samajavaragamana song becomes the most liked Telugu song:

<span>Ala Vaikunthapurramulo Song Creates Records</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs