Advertisement
Google Ads BL

‘ప్రేమ పిపాసి’ టీజర్ విడుదల


ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకం పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ‌ పిపాసి’. పి.ఎస్‌.రామ‌కృష్ణ (ఆర్ కే ) ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి (ఎమ్ఆర్) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా గెస్ట్ గా పాల్గొన్న పి.వి.ఆర్ విష్ణు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ రామ‌కృష్ణగారు నాకు గ‌త ఆరు నెల‌లుగా ప‌రిచ‌యం. సినిమాల పట్ల అభిరుచి ఉన్న నిర్మాత. ఇక టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టీజర్ చూసాక ద‌ర్శ‌కుడు మురళి కష్టం ఏంటో క‌నిపిస్తుంది. మూవీ హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా.. అన్నారు.

చిత్ర నిర్మాత పి. ఎస్ రామ‌కృష్ణ‌మాట్లాడుతూ... నిర్మాతగా ఇది నా ఫ‌స్ట్ సినిమా. హీరో జిపిఎస్ పెర్ఫార్మెన్స్ టీజర్ లో చూసింది కొంచమే. ఈ సినిమాతో మరో సేన్సేషనల్ హీరో పరిచయమవుతున్నాడు. ఇక మా డైరెక్టర్ మురళిగారు అన్నీ తానై ఈ సినిమాకు పని చేసారు. టీజర్ బట్టి తన టాలెంట్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. ప్రజంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నా ఫ్రెండ్ యుగంధర్ వ‌ల్లే నేను ఈ సినిమాని ముందుకు తీసుకురాగ‌లిగాను. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌లేదు. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 

కో -ప్రొడ్యూసర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉంటే ఫండింగ్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. నేను జీపిఎస్ ద్వారా ఈ సినిమాలో పార్ట్ అయ్యాను. డైరెక్టర్ మురళి చెప్పిన కంటెంట్ నచ్చి సినిమా నిర్మించాం.. అన్నారు. 

హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ... నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌కి థాంక్స్.. అన్నారు. 

క‌పిలాక్షి మల్హోత్రా మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు.. అన్నారు.

డైరెక్ట‌ర్ మురళి రామస్వామి మాట్లాడుతూ.. పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా సినిమా చాలా  క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమాను చాలా ‘రా’ గా తీసాం. ప్రతి మనిషిలో మరో మరో కోణం ఉంటుంది. అదే మా సినిమా. లవ్, రొమాన్స్, యాక్ష‌న్, కామెడీతో పాటు మంచి మ్యూజిక్ ఉంటుంది. కచ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుంది..అన్నారు. 

హీరో జిపిఎస్ మాట్లాడుతూ.. ప్రాణం పెట్టి సినిమా చేసాము. ప్రతి ఒక్కరు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. మా నిర్మాత  రామకృష్ణ గారు ప్యాషనేటెడ్ పర్సన్. ఎక్కడా ఖర్చుకి వెనకాడ లేదు. నేను ఇందులో ఇంత రఫ్ గా, రా గా నటించాను అంటే మా డైరెక్టర్ మురళిగారి వల్లే. మా డైరెక్ట‌ర్ ఎక్స్‌ట్రాడిన‌రీ టాలెంటెడ్‌. బ్రేక్ ద రూల్స్ అనేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. 

సినిమాటోగ్రాఫర్ తిరుమల మాట్లాడుతూ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫ్రీడమ్ తో మంచి ఔట్పుట్ ఇవ్వగలిగాం’’ అన్నారు. 

ఈ కార్యక్రమము లో జగన్నాథ్, శ్రీరామ్, జ్యోతి రాజ్ పుత్, ప్రొడక్షన్ డిజైనర్ రామస్వామీ(పండు) తదితరులు పాల్గొని టీజర్ పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.

Prema Pipaasi Teaser Released :

Prema Pipaasi Teaser Launch event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs