Advertisement
Google Ads BL

తమన్నా భలే తప్పించుకుందిగా..!!


కేవలం స్టోరీ లైన్ విని సినిమా ఓపెనింగ్ కి వచ్చేసిన తమన్నా.. తర్వాత పూర్తి కథ విన్నాక రాజుగారి గది 3 లో చెయ్యనని చెప్పడంతో...అసలు క్రేజ్ లేని అవికా గోర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు ఓంకార్. తమన్నాకైతే మంచి కథ రాసానని, కానీ తమన్నా ఒప్పుకోకపోవడంతో.. తర్వాత కథలో హీరో అశ్విన్ పాత్ర హైలెట్ చేస్తూ అవికా పాత్ర తగ్గించామని ఓంకార్ రాజుగారి గది 3 ప్రమోషన్స్ లో చెప్పాడు. అయితే నిన్న విడుదలైన రాజుగారి గది 3 చూసాక తమన్నా తప్పించుకుంది అని అనుకోకుండా ఉండలేం. అలాఉంది రాజుగారి గది3లో అవికా గోర్ చేసిన పాత్ర. అవికా నటనలో సూపర్ అయినా.. ఆమెకి సినిమాలో నటించే అవకాశం రానే రాలేదు. ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా చూపించాలనే తాపత్రయంలో సినిమా కథ మొత్తంగా అశ్విన్ అండ్ కామెడీ బ్యాచ్ చుట్టూనే తిప్పాడు కానీ... అసలు మెయిన్ లీడ్ అయిన అవికాని పట్టించుకున్న పాపాన పోలేదు.

Advertisement
CJ Advs

ఫస్ట్ హాఫ్‌లో భ‌య‌పెట్టే బాధ్య‌త అవికాపై వ‌దిలేస్తే.. బాగుండేది. కానీ ఓంకార్ ఫోకస్ మొత్తం అశ్విన్ మీదే ఉంది. అవికా గోర్ ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో అర్థం కాదు. కథలో అవికాకు అసలు కనీస ప్రాధాన్యం లేకుండా చెయ్యడంతో.... ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. మరి తమన్నా ఈ సినిమా నుండి తప్పుకుని మంచి పనే చేసింది. సినిమా ప్లాప్ అయినా.. హీరోయిన్ కేరెక్టర్ బావుంటే ఆమెకి మంచి మార్కులు  పడతాయి. కానీ ఇక్కడ రాజుగారి గది 3 సినిమా ప్లాప్, హీరోయిన్ పాత్ర ప్లాప్ అవడంతో.. హమ్మా తమన్నా భలే తప్పించుకుంది అనాల్సిందే.

Tamanna Great Escape:

Tamanna Out From Raju Gari gadi 3 was Right Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs