Advertisement
Google Ads BL

క్రిష్ మూవీ : సంపూ స్థానంలో అవసరాల!


టాలీవుడ్ నటుడు, దర్శకుడు కమ్ స్క్రిప్ట్ రైటర్ అవసరాల శ్రీనివాస్ ఈ మధ్య సినిమాల్లో కనిపించి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో ‘బాబు బాగా బిజీ’ మూవీతో సినీప్రియుల ముందుకొచ్చిన అవసరాల ఆ తర్వాత రియల్ లైఫ్ బిజీ బిజీ అయిపోయాడు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి.

Advertisement
CJ Advs

‘కొబ్బరిమట్ట’ సినిమా హిట్‌తో మంచి ఊపు మీదున్న సంపూర్ణేష్ బాబును హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్మాతగా మారిన దర్శకుడు క్రిష్ నిర్ణయించాడు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ మనసు మార్చుకున్న ఆయన.. సంపూ స్థానంలో అవసరాలను తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఎవరెవరు నిర్మిస్తారనే విషయం తెలిసింది కానీ.. దర్శకుడెవరనే విషయం తెలియరాలేదు. సినిమా నిర్మించడమే కాకుండా క్రిషే తెరకెక్కిస్తాడా లేకుంటే మరొకరు ఎవర్నైనా రంగంలోకి దింపుతారా అనేది తెలియాల్సి ఉంది.

కాగా.. ఓ వైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మించే పనిలో క్రిష్ బిజీబిజీగా ఉన్నాడు. అప్పట్లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ చిత్రానికి క్రిష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే సినిమా  ఘోరంగా ప్లాప్ అవ్వడంతో క్రిష్ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు.. ఆ తర్వాత తనలోని ప్రొడ్యూసర్‌ను పక్కనెట్టిన తాజాగా మరో సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. తన స్నేహితుడైన రాజీవ్ రెడ్డి, సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుతో కలిసి క్రిష్.. అవసరాలతో సినిమా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Krish Movie With Actor Avasarala Srinivas:

Krish Movie With Actor Avasarala Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs