Advertisement
Google Ads BL

‘గది 3’ చూశాక వెంకీ ఓకే అంటాడా?


నిన్న శుక్రవారం విడుదలైన ‘రాజుగారి గది 3’ సినిమాకి మిక్స్డ్ కాదు కానీ.. ప్లాప్ టాక్ పడిందనే చెప్పాలి. దర్శకుడు ఓంకార్ రాజుగారి గది సీక్వెల్‌తో దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. రాజుగారి గది సినిమాని పూర్తి కామెడీతో తీసిన ఓంకార్ రాజుగారి గది 2ని నాగార్జున, సమంత లాంటి పెద్ద స్టార్స్ తో ఎమోషనల్ డ్రామాగా నడిపించాడు. కానీ రాజుగారి గది 3 ని మాత్రం హర్రర్ కామెడీగా చూపిద్దామనుకున్నాడు. కానీ ఆ హర్రర్ కామెడీని ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. రాజుగారి గది సినిమా చూసి 2కి నాగార్జున, సమంత సైన్ చేశారు. ఇక రాజుగారి గది 2 కేవలం నాగార్జున, సమంతలనే చూసి కాస్తో కూస్తో ఆడింది కానీ... ఆ సినిమా ప్లాప్ అవ్వాల్సింది.

Advertisement
CJ Advs

ఇక రాజుగారి గది 3 లో అశ్విన్ ని హీరో చేసేద్దామనుకున్నాడు. మాస్ హీరోగా చూపించేదామనుకున్నాడు. కానీ ఓంకార్ ఎత్తుగడ రివర్స్ అయ్యింది. అశ్విన్ ని హీరోగా కన్నా కామెడీ గ్యాంగ్ లో చూడడమే బావుంది. అసలు న‌వ్వుల్ని పంచే ధ్యాస‌లో ప‌డిపోయిన ఓంకార్ .. అక్క‌డ‌క్క‌డ కాస్త శృతిమించిన కామెడీని ఇరికించేశాడు. ఎక్క‌డి నుంచి తెచ్చాడో గానీ, దెయ్యాల్ని కూడా మ‌రీ కామెడీ ఫేసులుగా చూపించాడు. దాంతో భ‌యం అనే ఎలిమెంట్ పూర్తిగా మాయ‌మైపోయింది. మరి ఇదంతా చూసాక వెంకటేష్ రాజుగారి గది సీక్వెల్ 4 లో నటించడానికి ముందుకొస్తాడంటే.. గ్యారంటీగా అనుమానపడాల్సిందే. ఎందుకంటే ఓంకార్ రాజుగారి గది సీక్వెల్ లో వెంకీని నటింప చెయ్యాలనుకున్నాడట. తన తదుపరి సినిమాలో వెంకీనే హీరో అంటూ ప్రమోషన్స్‌లో ఊదరగొట్టాడు.

Raju Gari Gadhi 3 Result at Box Office:

Is Venky Ok to Raju gari gadhi 4?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs