Advertisement
Google Ads BL

ఫస్ట్ అటెంప్ట్‌తోనే పాసైన ‘కొణిదెన’ కుర్రాడు!


‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీతో అనురాగ్ కొణిదెన టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్రిషి క్రియేషన్స్ పతాకంపై హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విశేషమేమిటంటే.. ఈ మూవీకి తండ్రి నిర్మాతగా వ్యవహరించగా ఆయన కుమారుడు హీరోగా నటించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ కొణిదెన కుర్రాడు తండ్రి బిజినెస్‌ను చూసుకుంటూ సినిమాపై అంటే ఫ్యాషన్‌తో రామానాయుడు ఫిలిం స్కూల్‌లో చేరాడు. అక్కడ యాక్టింగ్ నేర్చుకున్న ఈ కుర్రాడు.. ‘మళ్లీ మళ్లీ చూశా’ అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో అనురాగ్ నటన, యాక్షన్, హావభావాలను బట్టి చూస్తే ఫస్ట్ అటెంప్ట్‌తోనే పాసయ్యాడని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇదే రేంజ్‌ మెయిన్‌టైన్ చేస్తూ ముందుకెళ్తే మాస్ ఆడియాన్స్ తొందరగా దగ్గరవుతాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా మాస్‌ సినిమాలకే అట్రాక్ట్ అవుతున్నారన్నది తెలిసిన విషయమే. ఇప్పటికే సినీ ప్రియుల్లో ఒకింత గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ మంచి మంచి కథలతో వస్తే.. ఇతని సినిమాలను కూడా ‘మళ్లీ మళ్లీ చూస్తారు’ లేదంటే కష్టమే.

కాగా.. ఒక కుర్ర హీరో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడంటే అతనెవరు..? ఎవరి సపోర్ట్‌తో వచ్చాడు..? బ్యాగ్రౌండ్ ఏంటి..? అని టాలీవుడ్ నటీనటులే కాదు.. సినీ ప్రియులు కూడా ఆరా తీయడం మామూలే. ఇక కొణిదెన కుర్రాడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే.. విజయవాడ స్వస్థలం కాగా హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ సెటిల్ అయ్యింది. అలా వ్యాపారాలు చేసుకుంటున్న కోటేశ్వరరావు తిన్నగా ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడి సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్‌కు పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన కొణిదెన కుర్రాడి పరిస్థితి మున్ముంథు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

News About Malli Malli Chusa Hero Anurag Konidena:

News About Malli Malli Chusa Hero Anurag Konidena
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs