Advertisement
Google Ads BL

ఆ సినిమా స్ఫూర్తితో ‘RRR’ తీస్తున్నారా?


RRR విషయంలో హీరోలిద్దరికీ రెస్ట్ దొరికింది కానీ డైరెక్టర్ రాజమౌళి కి మాత్రం రెస్ట్ దొరకలేదు. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ ఫలానా సినిమా నుండి స్ఫూర్తి పొంది తీస్తున్నారు అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కానీ ఏది నిజమో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా RRR ఒక ఇంగ్లీష్ మూవీ నుండి కొంత భాగం ఇన్ స్పైర్ అయ్యి తీస్తున్నారు అని టాక్ బయటికి వచ్చింది.

Advertisement
CJ Advs

ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వేరువేరుగా చూపించనున్నారు. కాకపోతే ఇద్దరు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమానే చేగువేరా జీవితం ఆధారంగా తెరకకెక్కిన క్లాసిక్ ఫిలిం ‘మోటార్ సైకిల్ డైరీస్’ అనే చిత్రం నుండి కొంత భాగం ఇన్ స్పైర్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఇంగ్లీష్ మూవీలో చేగువేరా విప్లవ మార్గం ఎంచుకోక మునుపు తన స్నేహితుడితో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు బైక్ జర్నీ చేస్తాడు. ఆ జర్నీలో అతనికి ఎన్నో సంఘటనలు ఎదురు అవ్వడంతో అతను విప్లవ మార్గం వైపు వెళ్తాడు. మరి RRR లో ఇటువంటి ఎపిసోడ్ చూపిస్తారో లేదో చూడాలి.

ఇక ఈమూవీ 2020 జూలై 30న రిలీజ్ కానుంది. ఒకవేళ రాజమౌళి ఇన్ స్పైర్ అయ్యి తీసినా ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చే విధంగా తెరకెక్కిస్తారు కాబట్టి సినిమాపై ఆ ఇంగ్లీష్ సినిమా ఎఫెక్ట్ పడే అవకాశమే లేదు.

Gossips on RRR Movie Story:

English Movie Inspiration To RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs