Advertisement
Google Ads BL

గ్రాండ్‌గా ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’ ప్రీ-రిలీజ్!


బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌‌పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. శ్రీనాధ్‌ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయముతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు..ఈ సందర్భంగా హైదరాబాద్ జె ఆర్ సి లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆడియో బిగ్ సిడి ని, నటుడు బ్రహ్మనందం ట్రైలర్ విడుదల చేశారు.. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. ‘ గౌతంరాజు గారు ఇలా ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాను అనగానే చాలా కష్టమైన పని కదా..రిస్క్ ఎందుకు? అన్నాను. కానీ ఇప్పుడు కృష్ణ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు అనిపిస్తోంది. టైటిల్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుంది’ అన్నారు.

నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాది పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్ర. చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ సినిమా షూటింగ్ ఒరియాలో  కూడా చేయడం జరిగింది.   సినిమా మంచి హిట్ అయ్యి కృష్ణ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ..‘ నా ప్రియ మిత్రుడు గౌతమ్ రాజు గారు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలి’ అన్నారు.

‘మా’ అధ్యక్షుడు డా. నరేష్ వికె మాట్లాడుతూ.. ‘గౌతమ్ నాకు 30 సంవత్సరాలుగా తెలుసు. అందమైన నవ్వు, మంచి మాట అతనిది. మంచి నటుడిగా 400 సినిమాలు పూర్తి చేశాడు. అజాత శత్రువుగా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్నారు.  కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుంది’ అన్నారు.

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఒక చిన్న సినిమా అయినా దాన్ని కన్సిడర్ చేసి వచ్చినందుకు అందరికీ థాంక్స్. సినిమా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్’ అన్నారు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు ప్రొడ్యూసర్ కి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కృష్ణ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు’ అన్నారు.

నటుడు బ్రహ్మనందం మాట్లాడుతూ .. ‘హాస్య కుటుంబం నుండి వచ్చిన పిల్లలు హాస్యానికే పరిమితం అనుకుంటారు కానీ అది నిజం కాదు అని నిరూపించడానికి  హీరోగా కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. 

హీరోయిన్ ఎలెక్సా మాట్లాడుతూ .. ‘ఇంతమంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ.. ‘ మా సినిమాని విష్ చేసి నన్ను బ్లస్ చేసి పెద్దలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మా నాన్న గారితో సహా ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు.

గౌతంరాజు మాట్లాడుతూ .. ‘నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి అని కాదు కృష్ణ చాలా బాగా నటించాడు. ఇంతమంచి సినిమా తీసిన దర్శకుడు శ్రీనాధ్‌ పులకరం కి థాంక్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసి మా అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘ కేవలం గౌతం రాజు మీద అభిమానంతోనే ఈరోజు ఇంత మంది ఇక్కడికి వచ్చారు. ఈ సినిమా ఆరంభం లోనే కథ విని నేను ఒక్కటే చెప్పాను. కథ చెప్పినట్టు సినిమా  తీస్తే.. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని. సెకండాఫ్‌లో కథ మంచి టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమాలో కృష్ణ రావు నేనే.. నాకు కూడా ఆశ్యర్యమేసే అంశాలు చాలా ఉంటాయి. దర్శకుడు ఏదయితే చెప్పాడో అదే తీశాడు. అందుకు ఆయన్ని నేను అభినందిస్తున్నా. హీరోయిన్ చాలా బాగాచేసింది. సినిమా మంచి హిట్ అయ్యి జనం అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

 ఈ కార్యక్రమంలో నటుడు కృష్ణ భగవాన్, ఆలీ, రాజీవ్ కనకాల, తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, చిట్టిబాబు, రచ్చ రవి, తదితరులు పాల్గొన్నారు.

Krishna Rao Supermarket Pre Release Event:

Krishna Rao Supermarket Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs