ఈ రోజు ఉదయం మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ రోజు సాయంత్రం తానొక విషయాన్నీ అందరితో షేర్ చేసుకోబోతున్నా అంటూ ఆ ట్వీట్ పెట్టాడు . అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ కొత్త సినిమా విషయమై చెబుతాడని అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ మనోజ్ సినిమా విషయాలు చెప్పకుండా అందరికి అతి పెద్ద షాకిచ్చాడు. అది తన భార్య ప్రణీత రెడ్డి నుండి విడిపోతున్నట్లుగా,, విడాకులు కూడా తీసుకోబోతున్నట్లుగా చెప్పి అందరిని షాక్ కి గురిచేశాడు.
2015 లో ప్రణీత రెడ్డి ని ప్రేమించి పెళ్లాడిన మంచు మనోజ్... ఇప్పుడు సడన్ గా తన భార్య నుండి విడాకులు తీసుకోబోతుననల్టుగా ఓ పెద్ద ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేసాడు. నేను నా భార్య ప్రణీత రెడ్డి విడాకులు తీసుకోబోతున్నామని.... ఇది భాద కలిగించే అంశమే అయినా.. ఒకరి మనోభావాలకు మరొకరు విలువనిచ్చి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని.. మా ఇద్దరి వ్యక్తిగతం జీవితం పట్ల మాకు గౌరవం ఉంది.. కానీ కొన్ని అనుకోని కారణాల వలన మేము విడిపోవాల్సి వచ్చింది అంటూ మనోజ్ అందరికి తన వ్యక్తిగత విషయంలో ఇలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.