Advertisement
Google Ads BL

డిసెంబర్ 20న ‘ప్రతిరోజు పండగే’ విడుదల!


ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ప్రతిరోజు పండగే’ ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. ఆ తరువాత షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేస్తారు. అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు వేడుకలు సినిమా సెట్స్‌లో జరిగాయి.

Advertisement
CJ Advs

సుప్రీమ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి. తాత & మనవడు మధ్య రిలేషన్‌ను ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్‌లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ గారి సమర్పణలో... నిర్మాత‌ బ‌న్నీవాస్ సార‌ధ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది. సాయితేజ్, మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కనున్న ప్రతిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి మరింత చేరువైన ప్రముఖ న‌టులు స‌త్యరాజ్ క్యారెక్టర్‌ని ఈ సినిమా ద‌ర్శకులు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండ‌నుంది.

 

నటీనటులు:-

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు.

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి

సమర్పణ – అల్లు అరవింద్

ప్రొడ్యూసర్ – బన్నీ వాస్

కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్

మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)

ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు

డిఓపి – జయ కుమార్

పీఆర్ఓ – ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను.

Sai Dharam’s Film Release Date Locked:

Sai Dharam’s Film Release Date Locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs