డీజే తర్వాత పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. అది కూడా ఓ రేంజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో. మహేష్‌తో మహర్షి, ఎన్టీఆర్‌తో అరవింద సమేత, ప్రభాస్‌తో జాన్ సినిమాలు. అయితే అరవింద సమేత సినిమా డబ్బింగ్ అప్పుడు, మహర్షి షూటింగ్ లోను పాల్గొంటున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ లోను హౌస్ ఫుల్ 4 సినిమా షూటింగ్ తో తెగ బిజీగా గడిపింది. అరవింద సమేత డబ్బింగ్ ని పూజ హెగ్డే ఓ హోటల్ రూమ్‌లో కానిచ్చిందని, ఎక్కే ఫ్లైట్ ఎక్కి, దిగే ఫ్లైట్ దిగుతూ సినిమా అవకాశాలు వడిసి పట్టుకుంది ఈ హాట్ బేబీ. అంతలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ.. ప్రస్తుతం కూడా పూజ హెగ్డే అంతే బిజీగా అల్లు అర్జున్ సినిమా, ప్రభాస్, అఖిల్ సినిమాలతబిజీగా వుంది.
కానీ మరో హీరోయిన్ మాత్రం పూజాలా చెయ్యలేనంటుంది. లక్కీగా ఛలో, గీత గోవిందం సినిమాలతో టాప్ రేంజ్ కెళ్లిన రష్మిక ఇప్పుడు మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ ‘భీష్మ’తో పాటుగా తమిళనాట కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్. అయితే ఇప్పుడు రష్మిక చెంతకు మరిన్ని అవకాశాలొస్తుంటే.... నేను చెయ్యలేను అంటూ చెప్పేస్తుందట. నా డేట్స్ సర్దుబాటు చేసుకోలేకపోతున్నా అంటూ చేతులెత్తేస్తుందట. మరి పూజాలా నిమిషం ఖాళీ లేకుండా ఉండే టెక్నిక్ ఇంకా రష్మికకి ఒంటబట్టలేదంటున్నారు సినీ జనం.