Advertisement
Google Ads BL

బాలయ్య సినిమా టైటిల్‌ను ఆ ఛానెల్ చెప్పడమేంటి?


అసలు సినిమానే మొదలవ్వకుండా... నాగ చైతన్య - రష్మిక జంటగా నటిస్తున్నారని... ఆ సినిమా అదే నువ్వు అదే నేను అని తెలుగులో ఓ ప్రముఖ ఛానల్ జెమిని టివి ప్రకటించడమే కాదు.. అదే నువ్వు అదే నేను శాటిలైట్ హక్కులను కూడా తామే కొన్నట్టుగా ప్రకటించుకుంది. తాజాగా మరో సినిమా టైటిల్ ని జెమిని టివి ప్రకటించడమే కాదు ఆ సినిమా శాటిలైట్ హక్కులను తాము కొన్నట్టుగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. చైతు సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పకుండా టైటిల్ అండ్ శాటిలైట్ హక్కులను రివీల్ చేసిన జెమిని ఛానల్.. తాజాగా బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కాంబోలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా టైటిల్‌ని మాత్రం ప్రకటించింది.

Advertisement
CJ Advs

ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నట్లుగా బాలయ్య కొత్త చిత్రం టైటిల్ రూలర్ అని జెమిని టివి వారు ఓ పోస్టర్ ని ట్విట్టర్ లో వదిలి షాకిచ్చారు. అంతేకాకుండా రూలర్ శాటిలైట్ హక్కులను తాము సొంతం చేసుకున్నట్లుగా చెప్పి బాలయ్య అభిమానులను అయోమయంలో పడేశారు. దసరా కానుకగా బాలకృష్ణ కొత్త చిత్ర టైటిల్ కోసం ఎదురు చూసిన బాలయ్య అభిమానులు.. జెమిని టివి ఆఫీషియల్ ట్విట్టర్ లో ఇలా ఎలాంటి చడి చప్పుడు లేకుండా టైటిల్‌ని ప్రకటించడం పై వారు గుర్రుగా వున్నారు. చిత్ర బృందం కానీ, హీరో గారు కానీ, నిర్మాతలు కానీ చిత్ర టైటిల్ ప్రకటించకుండా.. శాటిలైట్ హక్కులను కొన్న జెమిని టివి ప్రకటించడం మాత్రం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. 

TV Channel Spoilers On Balakrishna Film:

Gemini TV Acquired Balakrishna Ruler Satellite Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs